AP News : అనారోగ్యంతో శ్రీశైలం ఆరోగ్య కేంద్రానికి మల్లన్న భక్తుడు... గంటపాటు కాలయాపన.. చివరికి..
ABN, Publish Date - Jan 02 , 2024 | 10:44 AM
Andhrapradesh: శ్రీశైలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు.
నంద్యాల, జనవరి 2 : శ్రీశైలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భక్తుడు అనారోగ్యంతో శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అయితే అతను ఆస్పత్రికి వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు. అనారోగ్యంతో ఉన్న భక్తుడిని వైద్యశాలలో ఎందుకు చేర్చుకోరు..? అంటూ 108 సిబ్బంది వైద్యశాల సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. వాగ్వివాదంతో గంటపాటు కాలయాపన చేయడంతో మల్లన్న భక్తుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్‌కు చెందిన సిద్దంశెట్టి సురేష్ ప్రసాద్ (35) అనే భక్తుడు శ్రీశైలంలో స్వామిఅమ్మవార్ల దర్శనం అనంతరం కుటుంబంతో కలసి సాక్షిగణపతి ఆలయ దర్శనానికి వెళ్లాడు. ఈ క్రమంలో సాక్షిగణపతి ఆలయం వద్ద అనారోగ్యంతో సురేష్ ప్రసాద్ పడిపోయాడు. ఆటోలో సిద్దం శెట్టి సురేష్ ప్రసాద్‌ను కుటుంబీకులు శ్రీశైలం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అయితే వైద్యశాల ముందు సిద్దం శెట్టి ప్రసాద్‌ను వైద్యశాల సిబ్బంది గంటపాటు ఆటోలోనే ఉంచారు. సకాలంలో వైద్యులు స్పందించకపోవడంతో సిద్దంశెట్టి సురేష్ ప్రసాద్ మృతి చెందాడని మృతుని భార్య ఆర్తనాదాలు అక్కడి వారిని కలిచివేసేలా చేసింది. వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్య ధోరణి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 02 , 2024 | 12:08 PM