ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి దిశగా రాష్ట్రం

ABN, Publish Date - Sep 27 , 2024 | 01:09 AM

గత ఐదేళ్ల వైసీపీ పాలనతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రం నేడు కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

నందికొట్కూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు, సెప్టెంబరు 26: గత ఐదేళ్ల వైసీపీ పాలనతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రం నేడు కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. గురువారం నందికొట్కూరు పట్టణంలోని ప్యారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ బేబి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రబ్బాని, టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, కౌన్సిలర్లు నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదన్నారు. వైసీపీ హయాంలో అన్న క్యాంటీన్లను జగన్‌ నిలుపుదల చేశారన్నారు. అయితే నేడు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదల కడుపు నింపుతోందన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేసి రైతులలో నెలకొన్న భయాందోళనలను చంద్రబాబు తొలగించారన్నారు. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లను ఇస్తామన్న హామీని దీపావళి నుంచి అమలు చేస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారన్నారు. ఐసీడీఎస్‌ ఏపీడీ కోటేశ్వరమ్మ, బీజేపీ నాయకుడు దామోదర్‌రెడ్డి, జనసేన నాయకుడు నల్లమల రవికుమార్‌, కౌన్సిలర్లు జాకీర్‌ హుస్సేన్‌, భాస్కర్‌రెడ్డి, మందడి వాణి, సుమలత, చాంద్‌బాష, లాలు ప్రసాద్‌, టీడీపీ నాయకులు ముర్తుజావళి, వేణుగోపాల్‌, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జూపాడుబంగ్లా: మండలంలోని తర్తూరు, పారుమంచాల గ్రామాల్లో గురువారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, రమణారెడ్డి అన్నారు. మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌ ప్రకాశం, నాయకులు నబీరసూల్‌, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

పాములపాడు: మండలంలోని క్రిష్ణారావుపేట గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి స్టిక్కర్లు అతికించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణ, సన్ని, జనార్దన్‌, ప్రసాద్‌, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లి: నందికుంట గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు మల్లెల కృష్ణారెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు జహరుల్లా, మధుసూదన్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌, వీఆర్వో కృష్ణారెడ్డి షమీవుల్లా, మహేష్‌, ప్రవీణ్‌ కుమార్‌, సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

నంద్యాల రూరల్‌: పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందని టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్‌ఎండీ ఫయాజ్‌ అన్నారు. గురువారం నందమూరినగర్‌లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, టీడీపీ నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో 37వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ కౌన్సిలర్‌ మామిడి ఉషారాణి, నాగరాజ్‌ కుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మణియార్‌ ఖలీల్‌, కౌన్సిలర్‌ నాగార్జున, తాటికొండ బుగ్గరాముడు, టీడీపీ నాయకులు, మున్సిపల్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మహానంది: గాజులపల్లి ఆర్‌ఎస్‌, యి.బొల్లవరం, అల్లీనగరం, శ్రీనగరం గ్రామాల్లో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు మధు, గాజులపల్లి ఆర్‌ఎస్‌ సర్పంచ్‌ అస్లాం బాషా, టీడీపీ నాయకులు శ్యామల జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసులు యాదవ్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

బండిఆత్మకూరు: బి.కోడూరు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ భరద్వాజశర్మ, బాలుడు, చలమయ్య, కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 01:09 AM