ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Oct 01 , 2024 | 12:19 AM

స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌పై పాఠశాల విద్యార్థుల ఉపన్యాస భావాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆకాంక్షించారు.

విజేతలకు జ్ఞాపికలు అందజేస్తున్న కలెక్టర్‌, జేసీ, అధికారులు

నంద్యాల (కల్చరల్‌), సెప్టెంబరు 30: స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌పై పాఠశాల విద్యార్థుల ఉపన్యాస భావాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆకాంక్షించారు. నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో పీజీఆర్‌ఎస్‌ వేదికలో భాగంగా స్వర్ణాంధ్ర2047 క్విజ్‌ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సోమవారం కలెక్టర్‌తో పాటు జేసీ విష్ణుచరణ్‌ జ్ఞాపికలు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్ర రూపకల్పనపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రణాళికలో విద్యార్థులు వివిధ అభివృద్ధి అంశాలను జోడిస్తూ ప్రసంగించిన తీరు అందరిని ఆకట్టుకుందన్నారు. పోటీలలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన పాఠశాల విద్యార్ధులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలు అందజేశారు.

ఆత్మకూరు: స్వర్ణాంధ్ర-2047 అంశానికి సంబంధించి జిల్లా స్థాయిలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ ప్రతిభా పోటీల్లో ఆత్మకూరు విద్యార్థులు సత్తా చాటారు. నంద్యాలలోని హోలీక్రాస్‌ పాఠశాలలలో సోమవారం నిర్వహించిన ఈ పోటీల్లో వక్తృత్వ విభాగంలో ఆత్మకూరులోని డీపౌల్‌ హైస్కూల్‌కు చెందిన హర్షిణి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. డిబేట్‌ విభాగంలో పద్మావతి హైస్కూల్‌ విద్యార్థులు జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. వ్యాసరచన పోటీల్లో చైతన్య హైస్కూల్‌కు చెందిన సనావుల్లా జిల్లాస్థాయిలో తృతీయ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్‌ బహుమతులను, ప్రశంస పత్రాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంఈవోలు బాలాజీనాయక్‌, సురేష్‌లు అభినందించారు.

Updated Date - Oct 01 , 2024 | 12:19 AM