ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
ABN, Publish Date - Aug 30 , 2024 | 12:43 AM
జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు ప్రముఖులు తెలుగు భాషా గొప్పదనంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు తెలుగు భాష గురించి వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఆత్మకూరు, ఆగస్టు 29: మాతృభాష పరిరక్షణకై ప్రతిఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని తెలుగు అధ్యాపకుడు విద్యాసాగర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
వెలుగోడు: వెలుగోడు ఏపీ మోడల్ స్కూల్‌లో తెలుగు భాషా దినోత్సవం, క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ నళిని తదితరులు పాల్గొన్నారు.
మహానంది: మండలంలోని ఎం. తిమ్మాపురంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు, ఏఈఓలు రామసుబ్బయ్య, నారాయణ, గ్రీన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనిధి రఘువీర్, శ్రీనివాసరెడ్డి, జానపద కళాకారులు పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: మండలంలోని శింగవరం జడ్పీ హైస్కూల్‌లో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. హెచ్‌ఎం దస్తగిరి, చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు ఉపాధ్యాయుడు ఆంజనేయులు నాయక్ పాల్గొన్నారు.
నందికొట్కూరు: నందికొట్కూరు డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం, క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలుగుభాష ఆంధ్ర రాష్ట్ర వికాస ఉద్యమ కార్యదర్శి జేఎస్‌ఆర్‌కే శర్మ హాజరయ్యారు. విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్ సునీత పాల్గొన్నారు.
అలాగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలుగుశాఖ అధ్యక్షుడు అన్వర్ హుస్సేన్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డా.పరిమళా దేవి, అకడమిక్ కోఆర్డినేటర్ డా.రఘుపతి రెడ్డి, గ్రంథాలయాధికారి రవీంద్రనాథ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాములపాడు: మండలంలోని వేంపెంట గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని హెచ్‌ఎం కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు
మిడుతూరు: కడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. హెచ్‌ఎం శ్రీధర్ కిశోర్, తెలుగు ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి, పీడీ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు చిన్న స్వామి, నరసింహారావు, మల్లు నాగేశ్వర రెడ్డి, సరస్వతి, చాంద్ బాషా, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Aug 30 , 2024 | 12:57 AM