ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముగిసిన ప్రాజెక్టు కమిటీ చైర్మన్ల ఎన్నికలు..!

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:01 AM

సాగునీటి సంఘాల ఎన్నికల తుది ఘట్టం ముగిసింది. కేసీ కెనాల్‌, తెలుగుగంగ, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను డీసీలు శనివారం ఎన్నుకున్నారు.

తెలుగుగంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన సంజీవకుమార్‌రెడ్డికి డిక్లరేషన్‌ అందిస్తున్న ఎస్‌ఈ సుబ్బారాయుడు

కేసీకి బన్నూరు, తెలుగుగంగకు సంజీవరెడ్డి, ఎస్సార్బీసీకి జిల్లెల

నాయకుల అండదండలున్న వారికే పట్టం

నంద్యాల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాల ఎన్నికల తుది ఘట్టం ముగిసింది. కేసీ కెనాల్‌, తెలుగుగంగ, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను డీసీలు శనివారం ఎన్నుకున్నారు. కేసీ కెనాల్‌ చైర్మన్‌గా బన్నూరు రామలింగారెడ్డిని కూటమి నాయకత్వం ముందుగానే నిర్ణయించటంతో ఈ ఎన్నిక లాంఛనప్రాయమే అయింది. ఇక తెలుగుగంగ, ఎస్సార్బీసీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ల గురించి ముందుగానే అనుకున్నా, ఎన్నికలు జరపాలని భావించారు. ఎన్నికలు లాంఛనంగా నిర్వహించి తమ అనుయాయులకే పట్టం కట్టారు.

చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు వీరే..

కేసీ కెనాల్‌, తెలుగుగంగ, ఎస్సార్బీసీ పరిధిలో జిల్లాలో దాదాపు 5 లక్షల ఆయకట్టు ఉంది. కేసీ కెనాల్‌ కింద 1,62,854 ఎకరాలు, ఎస్సార్బీసీ కింద 1,53,034 ఎకరాలు, తెలుగుగంగ కింద 1,29,412 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటికి చైర్మన్లుగా ఎన్నిక కావటం అంటే ఆ ప్రాజెక్టుల కింద ఉండే సమస్యలను తీర్చే పెద్దరికాన్ని భుజాన వేసుకోవటమే! అందుకే ఈ ప్రాజెక్టుల చైర్మన్‌ పదవులు కాస్త ప్రతిష్టాత్మకంగానే సాగాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నది కూటమి నేతలే కాబట్టి ఆయా ప్రాజెక్టులకు తమ వారిని చైర్మన్‌ గిరి కట్టబెట్టే విషయంలో భేదాభిప్రాయాలు లేకుండా చూసుకున్నారని తెలుస్తోంది. కేసీ కెనాల్‌ చైర్మన్‌ పదవి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరుడు బన్నూరు రామలింగారెడ్డికి దక్కగా, వైస్‌ చైర్మన్‌ పదవి కడప జిల్లా మైదుకూరుకు చెందిన గురవారెడ్డికి దక్కింది. ఇక తెలుగుగంగ చైర్మన్‌గా చెన్నారెడ్డి సంజీవకుమార్‌రెడ్డి ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌గా మనోహర్‌ చౌదరి ఎన్నికయ్యారు. ఇక ఎస్సార్బీసీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా జిల్లెల రాజశేఖరరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా మల్కి హుసేన్‌ ఎన్నికయ్యారు.

ముందే ఒప్పందం కుదిరిందా..?

కేసీ కెనాల్‌ చైర్మన్‌గా బన్నూరు రామలింగారెడ్డి ఎన్నిక పూర్తి కాలానికా లేక సగం కాలానికా అనే అనుమానాలున్నాయి. వాస్తవానికి కేసీ కెనాల్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు కడప నాయకులు బాగా ప్రయత్నించినట్లు సమాచారం. కేసీ కెనాల్‌కు నంద్యాల జిల్లా పరిధిలో 8 డీసీలు, కడప జిల్లా పరిధిలో 6 డీసీలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలోని ఓ రెండు డీసీలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ముందుగానే మేల్కొన్న జిల్లా నాయకులు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్లి రామలింగారెడ్డిని ఏకగ్రీవం చేయించుకున్నారు. అయితే కడప నాయకులు తమ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోతే సరైన న్యాయం జరగదనే భావనతో మొదటి రెండేళ్లకు నంద్యాల జిల్లాకు వెళ్లినా పర్వాలేదని, కానీ ఆ తర్వాత తమ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కెలా చూడాలని అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. ఇక తెలుగుగంగ ప్రాజెక్టుకు 8 డీసీలు ఉన్నాయి. ఇందులో 5 ఆళ్లగడ్డ పరిధిలో ఉండగా, 3 శ్రీశైలం పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు చైర్మన్‌గా ఆళ్లగడ్డ నాయకులకు సన్నిహితుడైన చెన్నారెడ్డి సంజీవకుమార్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌గా శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన మనోహర్‌ చౌదరి ఎన్నికయ్యారు. ఎస్సార్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి చైర్మన్‌గా జిల్లెల రాజశేఖరరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా మల్కి హుసేన్‌ ఎన్నికయ్యారు.

ఆశగా..: సాగునీటి సంఘాలు, ప్రాజెక్ట కమిటీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఆయకట్టుకు సకాలంలో సాగునీరందించే ప్రణాళికలపై ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఇకపై సాగునీటి రంగ ప్రక్షాళనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అడుగులు వేయనున్నారు. సాగునీటి సంఘాలు, ప్రాజెక్టు కమిటీలు కొలువుదీరటంతో సాగునీరు సక్రమంగా అందుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:01 AM