Share News

చౌక ధరకు టమోటా పంపిణీ

ABN , Publish Date - Jun 20 , 2024 | 12:53 AM

రైతు బజార్లలో బుధవారం చౌక ధరకు టమోటా పంపిణీ చేశారు.

చౌక ధరకు టమోటా పంపిణీ

కిలో రూ.62 ప్రకారం రైతు బజార్లలో విక్రయం

కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 19: రైతు బజార్లలో బుధవారం చౌక ధరకు టమోటా పంపిణీ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల టమోటా పంట సాగు గణనీయంగా తగ్గిపోయింది. బోర్లు, బావుల కింద కొంత మేర సాగు చేసిన టమోటాలు ప్రస్తుతం మార్కెట్‌లో అమ్మకానికి రైతులు తెస్తున్నారు. ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్‌ బారీగా పెరిగిపోయింది. చిల్లరగా టమోటాను కిలో రూ.100కు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వ ఆదేశాలపై మార్కెటింగ్‌ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కర్నూలు, నంద్యాల జిల్లాల మార్కెటింగ్‌ శాఖ ఏడీఎంలు నారాయణమూర్తి, రహిమా న్‌లు రైతుబజార్ల ద్వారా కిలో టమోటాలను రూ.62కు విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. బుధవారం సీ క్యాంపు రైతుబజారులో 62 బాక్సుల టమోటాలను వినియోగదారులకు ఏడీఎం నారాయణమూర్తితో పాటు ఎస్టేట్‌ అధికారి హరీష్‌ కుమార్‌, సెక్యూరిటీ గార్డులు శ్రీనివాసరెడ్డి, హార్టిక ల్చర్‌ అసిస్టెంట్‌ శివకుమార్‌, సెక్యూరిటీ గార్డులు చిన్నస్వామి, గోపాల్‌, హనుమంతు, గురువయ్య సాఫీగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిం చారు. అదేవిధంగా అమీన్‌ అబ్బాస్‌నగర్‌లో 30 బాక్సులు, కొత్తపేట రైతు బజారులో 30 బాక్సులు మొత్తం 160 బాక్సుల టమోటాలను వినియోగా దారులకు అందించగలిగామని ఏడీఎం నారాయణమూర్తి తెలిపారు. ధర లు తగ్గేంత వరకు నోలాస్‌, నో బెనిఫిట్స్‌ ప్రాతిపదికను టమోటాలను విని యోగదారులకు అందిస్తామని ఏడీఎం స్పష్టం చేశారు.

Updated Date - Jun 20 , 2024 | 12:53 AM