ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా వడిబియ్యం మహోత్సవం

ABN, Publish Date - Nov 16 , 2024 | 12:53 AM

మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు కంపమళ్ల నాగపుల్లయ్య శర్మ, కంపమళ్ల వీరయ్యశర్మ ఆధ్వ్వర్యంలో కొత్తూరులో శుక్రవారం వడిబియ్యం మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో వడిబియ్యం మహోత్సవంలో పాల్గొన్న మహిళలు

పాణ్యం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు కంపమళ్ల నాగపుల్లయ్య శర్మ, కంపమళ్ల వీరయ్యశర్మ ఆధ్వ్వర్యంలో కొత్తూరులో శుక్రవారం వడిబియ్యం మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సంతానంలేని మహిళలకు స్వామివారి సన్నిధిలో వడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సంతానలక్ష్మి పూజ నిర్వహించారు. అనంతరం మహిళ లకు చీరె, గాజులు, బియ్యం, కుంకుమ, పసుపు స్వామివారి ప్రసాదం అందించారు. ప్రధాన అర్చకుడు నాగపుల్లయ్య మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఈవో రామకృష్ణ, సిబ్బంది కార్యక్రమానికి తోడ్పాటునందించారని చెప్పారు. ఈ కార్యక్రమానికి పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరవడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాగశరభయ్య శర్మ, సుబ్బసత్యనారాయణ శర్మ, కృష్ణయ్య శర్మ, నారాయణశర్మ, సురేష్‌ శర్మ, రోహిత్‌ శర్మ, తిరుమల సేవా సమితి, బేతంచెర్ల బాలాజీ సేవా సమితి, నంద్యాల బాలాజీ ట్రస్ట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:53 AM