ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా విశ్వకర్మ జయంతి

ABN, Publish Date - Sep 17 , 2024 | 11:57 PM

నంద్యాల ఆర్టీసీ బస్టాండు సమీపంలో వెలసిన వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం విరాట్‌ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

విశ్వకర్మ మహాశాంతి హోమంలో పాల్గొన్న భక్తులు

నంద్యాల (కల్చరల్‌), సెప్టెంబరు 17: నంద్యాల ఆర్టీసీ బస్టాండు సమీపంలో వెలసిన వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం విరాట్‌ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచన, కంకణధారణ, అఽఖండ జ్యోతి ప్రజ్వలన, బ్రహ్మమహా కలశస్థాపన, గాయత్రి విశ్వకర్మ ఆవాహన బ్రహ్మ కలశ పూజా, పంచామృత అభిషేకం, విశ్వకర్మ మహాశాంతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌ ఆచారి, గౌరవ అధ్యక్షుడు గురుప్రసాద్‌, భక్తులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: పట్టణంలోని శ్రీకాళికాదేవి ఆలయంలో మంగళవారం విశ్వకర్మ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతి కమంటీ కన్వీనర్‌ సహదేవాచారి, సభ్యులు రాఘవాచారి, మౌళీచారి, నరసింహాచారి భగవాన్‌ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అలాగే కలశాలు ఉంచి పూజలు నిర్వహించారు.

Updated Date - Sep 17 , 2024 | 11:57 PM

Advertising
Advertising