ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాలో విజిబుల్‌ పోలీసింగ్‌

ABN, Publish Date - Nov 06 , 2024 | 12:16 AM

ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మంగళవారం విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.

విజిబుల్‌ పోలీసింగ్‌లో పాల్గొన్న పోలీసులు

నంద్యాల క్రైం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మంగళవారం విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ముఖ్యమైన కూడళ్లలో లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేస్తూనే మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదు చేశారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా ట్రిపుల్‌ రైడింగ్‌, వాహనానికి సరైన నెంబర్‌ ప్లేట్‌, రికార్డులు, హెల్మెట్‌ లేకపోవడం, సెల్‌ఫోన్‌ చేస్తూ డ్రైవింగ్‌ చేసేవారిని, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసేవారిని గుర్తించి జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గుర్తించిన బ్లాక్‌ స్పాట్ల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు సూచించేలా హెచ్చరికల బోర్డులు గమనించాలని, జాతీయ రహదారులపై స్పీడ్‌ గన్స్‌తో వేగ నియంత్రణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేలా, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయకుండా, పరిమితికి మించి ప్రయాణికులు వాహనాల్లో వెళ్లకుండా పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు.

Updated Date - Nov 06 , 2024 | 12:16 AM