పత్తి అమ్మకానికి పడిగాపులు
ABN, Publish Date - Dec 20 , 2024 | 12:39 AM
ఈ రైతు పేరు వెంకటస్వామి. బూడిదపాడు గ్రామం. రెండెకరాల్లో వచ్చిన పత్తి దిగుబడిని పెంచికలపా డులోని సీసీఐ పత్తి కేంద్రంలో అమ్మేందుకు మూడు రోజుల కింద వెళ్లాడు.
నిలిచిన పత్తి కొనుగోళ్లు
సీసీఐ కేంద్రం వద్ద రైతుల ఆవేదన
కొనుగోళ్లు లేక నిలిచిపోయిన పత్తి వాహనాలు
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఈ రైతు పేరు వెంకటస్వామి. బూడిదపాడు గ్రామం. రెండెకరాల్లో వచ్చిన పత్తి దిగుబడిని పెంచికలపా డులోని సీసీఐ పత్తి కేంద్రంలో అమ్మేందుకు మూడు రోజుల కింద వెళ్లాడు. ఇప్పటికీ అక్కడే పడిగాపులు పడుతున్నాడు. జిన్నింగ్ మిల్లులో ఎక్స్‌కవేటర్ ఒక యంత్రాన్ని ఢీకొట్టడంతో ఆ మిషన్ చెడిపోయి పత్తికొనుగోళ్లు నిలిచిపోయాయి. సోమవారం దాకా కొనుగోళ్లు జరగవని, ప్రస్తుతం టోకెను మాత్రమే ఇస్తామని అధికారులు ప్రకటిం చడంతో వందలాది మంది రైతులు పెంచికలపాడు కేంద్రం వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ఓ వైపు తుఫాను తరుముకొస్తే పత్తి ఎక్కడ తడిసిపో తుందో అని ఆందోళనపడుతున్నారు. రెండు వాహ నాల్లో తీసుకొచ్చిన పత్తిని కొనాలని ఈ రైతు అధికా రులను బతిమలాడుతున్నాడు. సూపర్‌వైజర్లు శ్రీను, హర్షద్ రైతులందరికీ పత్తి కొనుగోలుకు టోకెన్లు సక్రమంగా అందించేందుకు పర్యవేక్షణ చేస్తున్నారుగాని కొనేందుకు సిద్ధంగా లేరు.
సోమవారమైనా కొంటారా?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారి తుఫాన్ రాయలసీమ వైపు దూసుకు వస్తున్నదని వాతావ రణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం సాయం త్రానికి ఆకాశమంతా మబ్బులు కమ్మేశాయి. ఏ క్షణమైనా వర్షం వచ్చే అవకాశం ఉందని వ్యవ సాయ జిల్లా అధికారులు రైతులను హెచ్చ రిస్తు న్నారు. పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు జిల్లాలో పత్తి కొనుగోళ్లుకు ఆధారం గా ఉన్న పెంచికల పాడు లోని జిన్నింగ్ మిల్లు వద్ద యంత్రం చెడిపోవడంతో కొనుగోళ్లు నిలిపివే శారు. ఇంకో వైపు వర్షానికి, ఉధృతంగా వీచే గాలులకు కోతకు వచ్చిన పంట పెరికేవేసే అవకాశం లేకుండా పోయిందని, ఏ విధంగా పంటను కాపాడుకోవాలో అర్థం కావడం లేదని రైతులు బోరున విలపిస్తున్నారు.
Updated Date - Dec 20 , 2024 | 12:39 AM