ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లలితా నగర్‌ స్థలం కుదింపును ఖండిస్తున్నాం

ABN, Publish Date - Oct 30 , 2024 | 12:37 AM

నంద్యాల మున్సిపల్‌ కౌన్సిల్‌లో లలితానగర్‌లోని ప్రభుత్వ స్థలం కుదింపును మాజీ ఎమ్యేల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఖండించారు.

మాట్లాడుతున్న భూమా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల రూరల్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): నంద్యాల మున్సిపల్‌ కౌన్సిల్‌లో లలితానగర్‌లోని ప్రభుత్వ స్థలం కుదింపును మాజీ ఎమ్యేల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఖండించారు. మంగళవారం తులసీవనంలోని భూమా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిల్‌ సభ్యులు, అధికారుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్‌ కౌన్సిల్‌లో లలితానగర్‌లో ప్రవేట్‌ వ్యక్తులకు మున్సిపల్‌ స్థలం కుదించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌన్సిల్‌లలో వైసీపీ సభ్యులు అధికంగా ఉండడంతో ప్రభుత్వ స్థలాన్ని ప్రవేట్‌ వ్యక్తులకు కుదించడం ప్రపంచంలోని వింతలలో కౌన్సిల్‌ ఆమోదం ఒక వింతగా ఉందని అన్నారు. టీడీపీ హయాంలో 80 అడుగుల రోడ్డు ఉన్న సమయంలో నిర్మాణాలు చేపట్టే సమయంలో అభ్యంతరం చెప్పడంతో నిలిపి వేసిన విషయాన్ని గుర్తుచేశారు. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న 80 అడుగుల రోడ్డును 60 అడుగుల నుంచి ఇప్పుడు 30 అడుగులకు కుదించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థలం కుదింపులో డబ్బులు మారాయో, ఎందుకు కౌన్సిలో ఎందుకు ఆమోదం చేశారో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. కొన్ని ప్రాతాలలో 30 అడుగులకు తక్కువ ఉన్న ప్రాంతాలలో అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే అదికారులు ఈకుదింపు ఎలా సాద్యమని ప్రశ్నించారు. పుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగిస్తామని చెప్పే కమీషనర్‌ రేపు ఆక్రమణలు తొలగించడానికి జేసిబీలు ఎలా తీసుకెళతారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు అన్నాక్రాంతం కాకుండా ఉడేందుకు ఎంత దూరమైనా వెళతామని హెచ్చరించారు. ఈసమావేశంలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ మహబూబ్‌వలి, మాబువలి, భాస్కరరెడ్డి, నజీరా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 12:37 AM