ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నదాతలకు అండగా ఉంటాం

ABN, Publish Date - Sep 06 , 2024 | 01:29 AM

తుఫాను వల్ల పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

గోనె సంచులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

గడివేముల, సెప్టెంబరు 5: తుఫాను వల్ల పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆమె నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ఎమ్మెల్యే గౌరు చరిత బిలకలగూడురు గ్రామంలో గోనె సంచులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తప్పనిసరిగా న్యాయం చేస్తుందని అన్నారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. అయితే వైసీపీ నాయకులు ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు భరోసాగా ఉండక పోగా విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వర్షం వల్ల దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయిస్తామన్నారు. కూలిన మట్టిమిద్దెలకు పక్కా ఇళ్లు మంజూరు చేయిస్తామని అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మాజీ కో-ఆప్షన్‌మెంబర్‌ ఎస్‌ఏరఫిక్‌, సుదర్శన్‌రెడ్డి, పంట రామచంద్రారెడ్డి, చిందుకూరు సర్పంచ్‌ అనసూయమ్మ, తహసీల్దార్‌ విద్యా సాగర్‌, మండల వ్యవసాయాధికారి హేమసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 01:29 AM

Advertising
Advertising