ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దుతాం: మంత్రి

ABN, Publish Date - Nov 03 , 2024 | 12:39 AM

ఆర్‌అండ్‌బీ రోడ్లను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

నంద్యాలలో ‘గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కల్చరల్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆర్‌అండ్‌బీ రోడ్లను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శనివారం నంద్యాల సంజీవనగర్‌ గేటు వద్ద మిషన్‌ పాట్‌ హోల్‌ ప్రీ ఏపీప (గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమం కింద మంత్రి ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి గుంతలు లేని రోడ్డు పనులను ప్రారంభించారు. మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ నంద్యాల సంజీవనగర్‌ గేటు నుండిశ్రీనివాసనగర్‌ జంక్షన్‌ వరకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రహదారుల్లో గుంతలు పూడ్చేం దుకు ప్రభుత్వం రూ. 4.57 కోట్లు మొదటి విడతగా మంజూరు చేసిం దని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 15లోపు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తి చేయనున్నట్లు మంత్రి వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 369 కిలో మీటర్లు రహదారిని సంక్రాంతి పండుగలోపు రహదారుల్లోని అన్ని గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంజూరులు వస్తాయన్నారు. దీంతో పాటు పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ రోడ్ల పనులు కూడా మంజూరు కావాల్సి ఉందన్నారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, ఇంజనీరింగ్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

నందికొట్కూరు రూరల్‌: గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. మండలంలోని అల్లూరు గ్రామం బీటీ రహదారిలో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం మిషన్‌ పాట్‌ హోల్‌ ఫ్రీ ఏపీ (గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమం చేపట్టింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయసూర్య హాజరై పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గుంతలమయం చేసిందన్నారు. దీనికి సాక్ష్యం ప్రస్తుత ప్రభుత్వం పూడ్చుతున్న గుంతలే అని అన్నారు. గ్రామీణ రహదారులు మరీ అధ్వానంగా తయారయ్యాయన్నారు. గతంలో టీడీపీ హయాంలో పుష్కరాలకు వేసిన రోడ్లు 12 సంవత్సరాలు అయినా వాటివైపు వైసీపీ ప్రభుత్వం కన్నెత్తి చూడలేదన్నారు. ఎంపీడీవో సుబ్రహ్మణ్యశర్మ, ఏఈ మనోహర్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు మాండ్ర సురేంద్ర నాథరెడ్డి, అల్లూరు గ్రామ సర్పంచ్‌ చిన్ననాగ లక్ష్మయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 12:39 AM