ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KVP RamachandraRao: వైఎస్‌లో ఓ ప్రత్యేకత ఉండేది

ABN, Publish Date - Jul 08 , 2024 | 08:11 PM

ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.

Congress Party Leader KVP Ramachandra Rao

అమరావతి, జులై 08: ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్బంగా కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ... వైఎస్ ఒక్కసారి నమ్మాడంటే.. ఆ నాయకుడికి అండగా నిలబడేవారన్నారు.

ఆ నాడు హైదరాబాద్‌లో పి.జనార్దన్‌రెడ్డికి, విజయవాడలో వంగవీటి మోహన్‌రంగాలకు వైఎస్ కీలక బాధ్యతలు అప్పగించారని తెలిపారు. అయితే పార్టీలోని చాలా మంది దీనిని వ్యతిరేకించినా.. వైఎస్ఆర్ మాత్రం వారి పక్షానే నిలబడ్డారని గుర్తు చేశారు.

వంగవీటి మోహన్ రంగా సైతం అనంతరం కాంగ్రెస్ పార్టీని ఎంతో బలోపేతం చేశారన్నారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి వంగవీటి రంగానే కారణంగా నిలిచారని కేవీపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also Read:By Poll: కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ‘పరీక్ష’

Also Read: Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం.. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం


తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళిని నిర్మూలించేందుకు కొంత మంది ఏర్పాట్లు చేస్తే.. ఆ విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్.. వారికి వారి కుటుంబానికి రక్షణగా నిలిచారని తెలిపారు. ప్రస్తుతమున్న తెలంగాణా మంత్రులు, ముఖ్య నేతలు అందరూ గతంలో వైఎస్ఆర్ నాయకత్వంలో పని చేసిన వారేనన్నారు.

అయితే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాకినాడలో గ్యాస్ పడిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయని.. దీంతో 2 వేల మెగావాట్లు ప్లాంట్ కరీంనగర్‌లో పెట్టడమేమిటనే వాదన సైతం వచ్చిందన్నారు. ప్రాంతాల మధ్య అంతరాలను అధిగమించి ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా వైఎస్ నాతో పేర్కొన్నారన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌కు పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో.. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులు ఆయనకు అంతకన్నా ముఖ్యమన్నారు.

వైఎస్ పాదయాత్రను డిజైన్ చేసి పూర్తి చేయడంలో నా పాత్ర ఉందని నేను సగర్వంగా చెబుతున్నానని ఈ సందర్భంగా కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ సుస్థిర స్థానం సంపాదించారన్నారు.

Also Read: CPI Narayana: ‘వైఎస్ఆర్ ఉండుంటే.. రేవంత్ ఇక్కడికి వచ్చేవాడు కాదు’

Also Read: Anant-Radhika wedding: పెళ్లి సందడి.. ఆకాశాన్నంటిన హోటల్ రూమ్ ధరలు !


ఈ సభలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... వైఎస్ఆర్ మహా నాయకుడిగా ఖ్యాతి గడించారన్నారు. అయితే కొన్ని రాజకీయ మార్పుల వల్ల ఆయన పేరు మరుగన పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బిడ్డ షర్మిల.. వైఎస్ఆర్ పేరును మళ్లీ ప్రజల్లోకి తీసుకు వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: Mumbai: పలు విమాన సర్వీసులు దారి మళ్లింపు

నా భర్తకు ప్రాణదానం చేసిన మహా మనిషి వైఎస్ అని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ మరణానంతరం.. అ నేత కోసం మంత్రి పదవిని సైతం వదిలేశానని చెప్పారు. వైఎస్ఆర్ జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే గడిచిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయన వారసురాలిగా వైఎస్ షర్మిల ప్రయాణం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు.

Also Read: Viral Video: ‘టైగర్’ పుట్టిన రోజు.. సరిత ఏం చేసిందంటే..?

ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు మేమంతా ఆమెకు అండగా ఉంటామన్నారు. అయితే హైదరాబాద్‌లో వైయస్ స్మృతివనం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అదే వేదిక మీదున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.

Read Latest News And Telugu News

Updated Date - Jul 08 , 2024 | 08:20 PM

Advertising
Advertising
<