స్వర్ణాంధ్ర సాధన దిశగా బడ్జెట్: లంకా దినకర్
ABN, Publish Date - Nov 12 , 2024 | 05:11 AM
గత పాలన విధ్వంసం నుంచి వికాసంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా బడ్జెట్ ఉందని 20సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ఈ బడ్జెట్‌లో సమ ప్రాధాన్యం
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): గత పాలన విధ్వంసం నుంచి వికాసంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా బడ్జెట్ ఉందని 20సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ఈ బడ్జెట్‌లో సమ ప్రాధాన్యం కనపడిందన్నారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం దాదాపు 23 శాతం బడ్జెట్ నిధులు కేటాయింపులు చేయడమంటే, ఈ వర్గాలను స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వామ్యం చేయడమనే చెప్పవచ్చన్నారు. రాష్ట్ర జీడీపీలో 40 శాతంపైగా వాటా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.43,402 కోట్లు కేటాయించడం ద్వారా రైతు సంక్షేమ ప్రభుత్వంగా కనపడుతుందన్నారు. మాజీ సీఎం బడ్జెట్ సమావేశాలకు మొహం చాటేయడం బాధ్యతారాహిత్యం అని దినకర్ విమర్శించారు.
Updated Date - Nov 12 , 2024 | 05:12 AM