Reservoirs: జలాశయాలకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం..
ABN, Publish Date - Aug 10 , 2024 | 07:57 AM
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 2,86,919 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 4,11,236 క్యూసెక్కులు.
నంద్యాల : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 2,86,919 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 4,11,236 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం : 882.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 202.0439 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయడంతో సాగర్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది. ప్రాజెక్టు నుంచి 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లు పదిఅడుగుల మేర…..10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తు్న్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో : 3,60,691 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 588 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ సామర్థ్యం : 306.10 టీఎంసీలకు చేరుకుంది. పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు మరింతగా పెరిగింది. 15 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పులిచింతలకు ఎగువ నుంచి 3.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 32.16 టీఎంసీలకు చేరుకుంది.
మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 317.850 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ 8.319 టీఎంసీ (86.14%)లకు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,78,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,55,566 క్యూసెక్కులు. ప్రాజెక్టుకు సంబంధించిన 34 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1537 క్యూ సెక్కులు కాగా.. నంది పంప్ హౌజ్ కు 3150, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ 331క్యూసెక్కులు,ఎన్టీపీసీ కి 121క్యూసెక్కులు విడుదల చేశారు. కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 988 క్యూ సెక్కులు, అవుట్ ఫ్లో 833 క్యూ సెక్కులు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 697.925 అడుగులకు చేరుకుంది.
Updated Date - Aug 10 , 2024 | 07:57 AM