ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని వామపక్షాల ధర్నా

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:54 AM

పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించేంత వరకు తమ పోరాటం చేస్తామని వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

విజయవాడ(ధర్నాచౌక్‌), నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించేంత వరకు తమ పోరాటం చేస్తామని వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ప్రధాని మోదీకి లొంగి ప్రజలపై భారం మోపుతున్నారని ఽమండిపడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పది వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో మంగళవారం ధర్నా జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌, ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి లొంగి ఆదానీతో లాలూచీ పడి ప్రజలపై భారం వేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్‌ చార్జీలు పెంచబోమని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికే రూ. 6 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని విమర్శించారు. మరో రూ.11,820 కోట్ల భారం వేసేందుకు విద్యుత్‌ నియంత్రణ మండలి అభ్యంతరాలు తెలియజేయాలని కోరగా వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాలు అభ్యంతరాలు తెలియజేశాయన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 06:13 AM