Palle Raghunatha Reddy:అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం
ABN, Publish Date - Apr 22 , 2024 | 01:22 AM
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 21: రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ అవినీతి పాలనకు చమరగీతం పాడాలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మిట్టపల్లి పంచాయతీ మిట్టపల్లి, వణుకువారిపల్లి, మల్లాపల్లి తదితర గ్రామా ల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తర్వాత పల్లె ఇంటింటా తిరిగి ప్రజలకు సూపర్‌సిక్స్ పథకాల గురించి తెలిపారు.

చంద్రబాబు సీఎం అయిన వెంటనే వాటిని అమలు చేస్తారని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అక్రమ సంపాదనకే మక్కువ చూపారన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఏమా త్రం శ్రద్ధ పెట్టలేదన్నారు. రాష్ట్రం మొత్తం మీద వైసీపీ అవినీతి పాలన సాగించిందన్నారు. ఈ దుష్ట పాలనకు అందరూ ఓటు ద్వారా చరమగీతం పాడాలని సూచించారు. ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకుఓటువేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Apr 22 , 2024 | 01:22 AM