కార్యకర్త కుమారుడి వైద్యానికి లోకేశ్ సాయం
ABN, Publish Date - Nov 19 , 2024 | 03:18 AM
టీడీపీ కార్యకర్త కుమారుడి వైద్య ఖర్చులకు మంత్రి నారా లోకేశ్ రూ.2.60 లక్షలుసాయం చేశారు.
నేరేడుగొమ్ము, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యకర్త కుమారుడి వైద్య ఖర్చులకు మంత్రి నారా లోకేశ్ రూ.2.60 లక్షలుసాయం చేశారు. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌కు చెందిన పసుపులేటి ఆంజనేయులు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసేవారు. ఆయనకు నెల రోజుల కిందట రెండో సంతానంగా కొడుకు పుట్టాడు. ఆ చిన్నారికి గుండె సంబంధిత సమస్య ఉండటంతో వైద్యానికి రూ.3.50 లక్షలు అవుతుందని హైదరాబాద్ రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ విషయం నారా లోకేశ్‌కు తెలియడంతో వైద్యం కోసం రూ.2.60 లక్షలు అందించారు.
Updated Date - Nov 19 , 2024 | 03:18 AM