ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బలపడిన అల్పపీడనం

ABN, Publish Date - Dec 19 , 2024 | 04:00 AM

నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బుధవారానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది.

రాష్ట్రంలో ముసురు వాతావరణం.. పలుచోట్ల వర్షాలు, చలిగాలులు

నేడు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా తీవ్ర అల్పపీడనం రాక

ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు

వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక

విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బుధవారానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్యంగా పయనిస్తూ గురువారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు రానుంది. తర్వాత 24 గంటల్లో ఉత్తరంగా పయనిస్తూ శుక్రవారానికల్లా కోస్తా తీరం వెంబడి పయనిస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో కోస్తాలో తీరం దాటుతుందా? లేక సముద్రంలో ఇంకా బలపడుతుందా? లేదా భూ ఉపరితలం మీదుగా బలహీనపడుతుందా అనేది ఇంకా వెల్లడించలేదు. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి కోస్తాలో వర్షాలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం నుంచి ముసురు వాతావరణం కొనసాగింది. బుధవారం రాత్రి విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో గురువారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, శ్రీకాకుళం, అల్లూరి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ నెల 20వ తేదీన ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీవ్ర అల్పపీడనం కోస్తా వైపు రానున్న క్రమంలో గురువారం కోస్తా తీర ప్రాంతాల్లో, 20, 21 తేదీల్లో ఉత్తరాంధ్ర మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - Dec 19 , 2024 | 04:44 AM