Fire Accident: మదనపల్లి అగ్ని ప్రమాదం ఆ కుటుంబం పనేనా?
ABN, Publish Date - Jul 22 , 2024 | 12:28 PM
మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదంపై మొదటి నుంచి అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. వైసీపీ పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబీకులు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే.
చిత్తూరు: మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదంపై మొదటి నుంచి అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. వైసీపీ పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబీకులు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ రికార్డు మాయం చేసేందుకే అగ్ని ప్రమాదం సృష్టించారని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే హెలికాఫ్టర్‌లో ఘటనా స్థలానికి బయలుదేరారని సీఎం చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ఆదేశించిన వెంటనే డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణ కోసం మదనపల్లికి బయలుదేరారు. అగ్ని ప్రమాదం జరిగిన సబ్ కలెక్టరేట్‌లోకి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఆదివారం రాత్రి 11 గంటల వరకూ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ అనుమానస్పదంగా ఉండినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌతమ్ తేజ సెల్ ఫోన్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఎదుట సీపీఐ నాయకులు ధర్నాకు దిగారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్లు, కీలక ఫైళ్ల దహనానికి కారణమైన ఉద్యోగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదం కుట్ర వెనక మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబీకుల హస్తం ఉందంటూ ఆరోపణలు వినవస్తున్నాయి. కేవలం కీలక రికార్డులో ఉన్న విభాగాలు మాత్రమే దగ్ధం కావడం, మిగిలిన విభాగాలు కాలకపోవడంపై సీపీఐ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో పనిచేసిన ఆర్డీవో, కలెక్టర్ రెవెన్యూ పాలన పైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు దగ్ధమయ్యాయి. సంఘటన మరువక ముందే మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో కీలక ఫైలు దగ్ధం కావడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
AP Politics: జనసేనతో టచ్‌లోకి వైసీపీ మాజీ మంత్రులు.. పవన్ రిప్లైతో కంగుతిన్న నేతలు..!
Gautam Gambhir: రోహిత్, కోహ్లీ 2027 ప్రపంచకప్ కూడా ఆడగలరు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్!
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 22 , 2024 | 12:28 PM