ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీరులెవరో!

ABN, Publish Date - Dec 26 , 2024 | 01:00 AM

జిల్లా స్థాయిలో మార్కెట్‌ కమిటీల పాలక మండళ్ళు నియామకం నెరపాలంటే ముందస్తుగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. పక్షం రోజుల క్రితమే ప్రభుత్వం ఈ మేరకు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశిం చింది. అయినా రిజర్వేషన్ల ఖరారులో తీవ్ర జాప్యం. ఇప్పటికే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెద్ద సంఖ్యలోనే ఉంది.

మార్కెట్‌ కమిటీల పదవులకు పోటాపోటీ

ఇప్పటికీ నిర్ధారణ కాని రిజర్వేషన్లు

భారీగా ఆశావహులు

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిళ్ళు

టీడీపీ, జనసేనలోనే అత్యధిక పోటీ

జిల్లాలో ఎనిమిది మార్కెట్‌ కమిటీలు

త్వరలోనే నామినేటెడ్‌కు అవకాశం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

జిల్లా స్థాయిలో మార్కెట్‌ కమిటీల పాలక మండళ్ళు నియామకం నెరపాలంటే ముందస్తుగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. పక్షం రోజుల క్రితమే ప్రభుత్వం ఈ మేరకు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశిం చింది. అయినా రిజర్వేషన్ల ఖరారులో తీవ్ర జాప్యం. ఇప్పటికే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెద్ద సంఖ్యలోనే ఉంది. ప్రభుత్వం సైతం సంక్రాంతి నాటికి ఈ నియామకాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉంది. అయితే అటు ఖరారుకాని రిజర్వేషన్ల ప్రక్రియ, ఇటు పెరుగుతున్న ఆశావహుల సంఖ్య అన్ని పక్షాలకు తలనొప్పి కాబోతుంది. ఇప్పటికే మూడు దఫాలుగా నామినేటెడ్‌ పదవుల జాబితాను విడుదల చేసినప్పుడు ఆ జాబితాలో తమ పేరులేక డీలాపడిన సీనియర్లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మార్కెట్‌ కమిటీల్లోను అదృష్టం ఎవరికనేది త్వరలోనే తేలబోతుంది.

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈ పదవి దక్కించుకుంటే చాలు.. స్థానిక ఎమ్మెల్యే తర్వాత అంత టి స్థానం సంపాదించేది ఈ పదవిలో ఉన్నవారే. అందుకనే వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి కోసం ఆది నుంచి ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి ఉంటుం ది. ఎన్నికల్లో ఎవరైతే తమ కోసం చెమటోడుస్తారో అటువంటి వారినే చైర్మన్‌ పదవికి ఎంపిక చేస్తారు. గత ఐదేళ్ల జగన్‌ ప్రభుత్వంలో ఈ కమిటీల నియా మకంలో మార్పులు, చేర్పులు చేశారు. 33 శాతం బీసీలకు, 50 శాతం మహిళలకు ఉండేలా చర్యలను తీసుకుని అమలు చేశారు. మార్కెట్‌ కమిటీ నియా మకం జరిగేటప్పుడు దామాషా పద్ధతిలోనే ఈ రిజర్వేషన్‌ ప్రక్రియ ఉండాలనేది ఆనాటి ప్రభుత్వ నిర్ణయం. ఇప్పుడు అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆ దామాషా పద్ధతితోనే అనుసరించాల్సి వస్తోంది. దీంతో నామినేటెడ్‌ పదవుల ఖరారులో కొంత గందరగోళం లేక పోలేదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటికి చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను నియమిం చాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటే ముందుగా ఆయా కమిటీల స్థితిగతులను గమ నించి దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిన యంత్రాంగం ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకో లేదు. ఇంకోవైపు మార్కెట్‌ కమిటీలన్నింటికీ చైర్మన్‌ పదవికి పోటీ పడేవారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. బీజేపీ మినహాయించి జనసేన, టీడీపీకి చెందిన సీని యర్లు చైర్మన్‌ పదవికి ఎక్కువగా పోటీ పడుతున్నారు.

నాకు కావాలి.. కాదు నాకే ఇవ్వండి

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల నామినేటెడ్‌ విష యంలో ఇప్పటికే టీడీపీ, జనసేనలో తీవ్ర పోటీ నెల కొంది. గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టించి పనిచేశా మని, తాము ఆ పదవికి అర్హులమంటూ సీనియర్లతో పాటు పలుచోట్ల జూనియర్లు ఇప్పటికే రంగంలో ఉన్నారు. దెందులూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవికి మాజీ జడ్పీటీసీ గారపాటి సీత, మాజీ చైర్మన్‌ మాగంటి నారాయణప్రసాద్‌ (మిల్లుబాబు), లావాటి శ్రీనివాస్‌, తాతా సత్య నారాయణ మధ్య మొదటి నుంచి పోటీ ఉంది. వీరిలో శ్రీనివాస్‌ను ఈ మధ్యనే కాపు కార్పొ రేషన్‌ డైరెక్టర్‌ పదవి వరించింది. బీసీ వర్గాల నుంచి సత్యనారాయణ పోటీ పడుతుండగా ఈసారి తనకే అవకాశం ఇవ్వా లని పెదపాడుకు చెందిన గారపాటి సీత పట్టుపడు తున్నారు. దీంతో ఈ మార్కెట్‌ కమిటీ ఓసీలకు లేదా మహిళలకు రిజర్వు అయితే ఆ కమిటీకి చైర్మన్‌గా సీతకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఈ కమిటీ నియా మకంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఏలూరు మార్కెట్‌ కమిటీకి నువ్వానేనా అన్నట్టుగా పోటీ ఉంది. ఈడా చైర్మన్‌ పదవి నిర్వహించిన మధ్యా హ్నపు ఈశ్వరి, ఆమె భర్త బలరాం పేర్లు సైతం విని పిస్తున్నాయి. వీరితోపాటు నగరంలో పార్టీ బాధ్యతలు మోస్తున్న శివప్రసాద్‌ ఎన్నికల నుంచి ఇప్పటివరకు కీలక నేతగా ఉన్న కంప్యూటర్‌ చల్లా వెంకట సత్యవర ప్రసాద్‌ (కంప్యూటర్‌ ప్రసాద్‌) పోటీలో ఉన్నారు. ఉంగుటూరు మార్కెట్‌ కమిటీ నుంచి టీడీపీకి చెందిన రెడ్డి చందు, పాతూరి విజయ కుమార్‌, జనసేనకు చెందిన వంగా రఘు పేర్లు వినిపిస్తు న్నాయి. వీరిలో చందు జిల్లా తెలుగు యువత అధ్య క్షుడిగా ఉన్నారు. విజయ కుమార్‌ గతంలోను మార్కెట్‌ కమిటీ బాధ్యతలు నిర్వర్తించారు. ఉంగుటూరు నియో జకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య పోటీ నెలకొంది. ఇదే నియోజకవర్గంలో భీమడోలు మార్కెట్‌ కమిటీకి జనసేన నుంచి ప్రత్తి మదన్‌, టీడీపీ నుంచి కమ్మ పద్మ రంగంలో ఉన్నారు. ఈ రెండు కమిటీలకు సంబంధించి అటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజక వర్గ కన్వీనర్‌ గన్ని వీరాంజనేయులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఒక నిచ్చితాభిప్రాయానికి రావాల్సి ఉంది. ఒక్క నియోజకవర్గంలోనే రెండు కమిటీలు ఉండడంతో స్నేహపూర్వకంగానే వీరిద్దరి సిఫార్సులకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది.

చింతలపూడి మార్కెట్‌ కమిటీలోను భారీగా పోటీ ఉంది. జనసేన, టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. టీడీపీ సీనియర్‌ నేతలు అబ్బిన దత్తాత్రేయ, గుత్తా ప్రసాద్‌, సూరనేని గోపితోపాటు జనసేనకు చెందిన చీదరాల మధుబాబు చైర్మన్‌ పదవికి పోటీ పడుతు న్నారు. గడిచిన ఎన్నికల్లో వీరంతా కూటమి పక్షాన కీలకంగా వ్యవహరించారు. ఇంతకుముందు ఇదే మార్కెట్‌ కమిటీ మహిళకు రిజర్వు కావడంతో అప్ప ట్లో జగ్గవరపు జానకీరెడ్డి చైర్‌పర్సన్‌గా వ్యవహరించా రు. చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ ఆచితూచి అడుగు వేస్తారని భావిస్తున్నారు. కైకలూరు కమిటీ నుంచి కైకలూరు మండల టీడీపీ అధ్యక్షుడు పెన్మత్స శ్రీనాథరాజు, మాజీ ఎంపీటీసీ శ్రీదేవి, బీసీ నేత పూల రామచంద్రరావు ఆశిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో కలిదిండి మార్కెట్‌ కమిటీకి టీడీపీ మండల అధ్యక్షుడు పోకల జోగిరాజుకు దాదాపు చైర్మన్‌ గిరి ఖరారైనట్టు ఇప్పటికే ప్రచారం సాగుతోంది.

నూజివీడుదంతా క్లైమాక్స్‌లోనే..

నూజివీడు మార్కెట్‌ కమిటీ పాలక మండలి నియామకం ఎప్పుడూ రివర్సే. ఈ నియోజకవర్గంలో చైర్మన్‌ పదవి ఆశించే వారి సంఖ్య ఎప్పుడూ అత్యధికమే. కాని ఈ మార్కెట్‌ కమిటీకి ప్రతీసారి ఒక సెంటిమెంట్‌ ఉంది. ప్రభుత్వం ఏది అధికారంలోకి వచ్చినా, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎవరున్నా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నియామకంలో అందరి నేర్పరితనం ఒకటే. నాలుగున్నరేళ్లు కమిటీని నాన్చి నియామకం చేయకుండా జాప్యం చేసి చివరి ఐదారు నెలలే పాలన ఉందనగా అప్పుడు చైర్మన్‌ పదవిలో ఎవరొకరిని నియమిస్తారు. పోటీ తీవ్రంగా ఉండడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరికి ఈ పదవిని కట్టబెట్టకుండా జాప్యం చేయడమే ఇందుకు కారణం. ఈ మార్కెట్‌ కమిటీ పదవిని టీడీపీ నేతలు అక్కినేని చందు, చిట్నేని శివరామకృష్ణ ఆశిస్తున్నారు.

ఎందుకింత జాప్యం ?

మార్కెట్‌ కమిటీల నియామకంలో రిజర్వేషన్ల ప్రక్రియ అత్యంత కీలకం. కాని ఇక్కడే జాప్యం జరుగు తోంది. రెండు వారాల క్రితమే ప్రభుత్వం రిజర్వేషన్లను నిర్ధారించాల్సిందిగా కలెక్టర్లను ఆదేశిం చినా ఇప్పటి వరకు మార్కెట్‌ చైర్మన్‌ విషయంలో రిజర్వేషన్లను ఖరారు చేయలేదు. ఒకవేళ అదే రిజ ర్వేషన్లు ఖరారై ఉంటే కేవలం దీనికి అనుకూలంగానే ఒకరిద్దరు మాత్రమే పోటీ పడడం, మిగిలిన వారు రంగం నుంచి తప్పుకునేవారు. కాని చైర్మన్‌ పదవి ఆశిస్తున్న వారి సంఖ్య క్రమేపీ పెరగడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. జాప్యం జరగడానికి గల కారణాలపై అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదు.

Updated Date - Dec 26 , 2024 | 01:00 AM