ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:32 PM
ప్రభుత్వ భూములు అక్రమణ లకు గురికాకుండా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొంటునట్లు ఆర్డీవో ఏ.శ్రీనివాసులు తెలిపారు.
కలకడ, డిసెంబరు 20(ఆంధ్రజ్యో తి):ప్రభుత్వ భూములు అక్రమణ లకు గురికాకుండా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొంటునట్లు ఆర్డీవో ఏ.శ్రీనివాసులు తెలిపారు. కలకడ మండలం బాటవారిపల్లెలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై ప్రజల నుంచి ఆర్జీలు తీసు కుని పరిశీలించారు. ఈ సందర్భం గా ఆర్డీవో మాట్లాడుతూ మండలం లోని గ్రామాల్లో అనక్రాంతమైన చెరువులు, కుంటలు, రస్తాలు, ఇతర ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని సిబ్బంది ఆదేశించారు. ముఖ్యంగా రీ సర్వేలో దొర్లిన తప్పిదాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తునట్లు తెలిపారు. కొన్ని చోట్ల చిన్న చిన్న భూ సమస్యలున్న అవి రైతుల పరస్పర అంగీకారంతో పరిష్కృతం అవుతాయ న్నారు. రెవెన్యూ పరంగా భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికే సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయచోటి రెవెన్యూ డివిజన పరిధిలోని 164 గ్రామాల్లో వచ్చే నెల 8వ తేదీ వరకు జరిగే సదస్సులను ఆయా గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నోడల్ అధికారి రవిచం ద్రబాబు, తహశీల్దార్ ఫణికుమార్, డీటీ భార్గవి సిబ్బంది పాల్గొన్నారు.
పీలేరులో: భూసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోం దని రాయచోటి ఆర్డీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. పీలేరు మండలం బాలంవారిప ల్లెలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులలో ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. బాలంవారి పల్లెలో జరిగిన సదస్సులో వివిధ భూసమస్యలపై అధికారులకు 50 అర్జీలు అందా యి. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిణి రమ, నోడల్ అధికారి భరత కుమా ర్‌రెడ్డి, తహసీల్దారు భీమేశ్వర రావు, సర్వేయర్ కిరణ్మయి పాల్గొన్నారు.
పెద్దమండ్యంలో: పెద్దమండ్యం గ్రామ పంచాయతీ చెరువుకిందపల్లి లో శుక్రవారం రైతు సదస్సులో అన్నిశాఖల సమస్యలపై 72 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపా రు. తహసీల్దార్ సయ్యద్ ఆహ్మద్, ఆర్‌ఐ రమేష్, కూటమి నేతలు లంపవంక చెరు వు చైర్మన చలపలతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 11:32 PM