రూ.418 కోట్ల ధాన్యం కొనుగోలు: మంత్రి నాదెండ్ల
ABN, Publish Date - Nov 20 , 2024 | 04:22 AM
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.418.75 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.418.75 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 617 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24,051 మంది రైతుల నుంచి 1,81,988 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు రూ.391.50 కోట్లు రైతులకు చెల్లించినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు మంత్రి మనోహర్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులు తమ ధాన్యాన్ని ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో వారే నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం వాట్సప్ చాట్‌బోర్డ్‌ని ప్రవేశపెట్టిందన్నారు. రైతులకు గోనెసంచుల సరఫరా నుం చి ధాన్యం రవాణా వరకు విధానాలను సులభతరం చేశామన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 04:23 AM