ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister S. Savitha : కూటమి ప్రభుత్వంలో చేనేతకు పూర్వ వైభవం

ABN, Publish Date - Sep 20 , 2024 | 05:53 AM

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా అధునాతన డిజైన్ల రూపకల్పనలో చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి ఎస్‌.సవిత తెలిపారు.

  • ఇల్లు మునిగిన నేతన్నలకు 30 వేలు: మంత్రి సవిత

మంగళగిరి సిటీ, సెప్టెంబరు 19: ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా అధునాతన డిజైన్ల రూపకల్పనలో చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లోని వీవర్‌శాలను గురువారం ఆమె సందర్శించారు. మగ్గాల ఏర్పాటు, స్టోర్‌ రూమ్‌, క్వాలిటీ కంట్రోల్‌ రూమ్‌, సేల్స్‌ కౌంటర్లను పరిశీలించారు. స్టాండు మగ్గాలు, జకార్డ్‌ మిషన్ల పనితీరును పరిశీలించారు. అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ... ‘మంత్రి లోకేశ్‌ ఏర్పాటు చేసిన వీవర్‌శాల ద్వారా ఎంతో మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు స్వయం ఉపాధి లభిస్తోంది. చేనేతలను అన్ని విధాలా అభివృద్ధి పరచడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో వుంచుకుని ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌ తరహాలో చేనేత వస్త్రాల అమ్మకాల ఎగ్జిబిషన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం. ఇటీవల కురిసిన వర్షాలకు చేనేత కార్మికులకు జరిగిన నష్టంపై నివేదికలు తెప్పించాం. పూర్తిగా ఇల్లు మునిగిపోయిన చేనేత కార్మికులకు రూ.25 వేలతోపాటు నూలు కోసం అదనంగా రూ.5 వేలు ఇవ్వనున్నాం’ అని తెలిపారు.

Updated Date - Sep 20 , 2024 | 05:53 AM