ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Satya Kumar: అవయవదానానికి అంగీకరిస్తూ మంత్రి సత్యకుమార్ సంతకం..

ABN, Publish Date - Aug 02 , 2024 | 12:52 PM

జీవన్ దాన్ పై అవగాహన కార్యక్రమంలో‌పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. ఇదే వేదిక పై అవయవదానానికి అంగీకరిస్తూ మంత్రి సత్యకుమార్ సంతకం చేశారు.

విజయవాడ: జీవన్ దాన్ పై అవగాహన కార్యక్రమంలో‌పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. ఇదే వేదిక పై అవయవదానానికి అంగీకరిస్తూ మంత్రి సత్యకుమార్ సంతకం చేశారు. అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులను సత్యకుమార్, బోండా ఉమ సత్కరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా...‌ ప్రజల్లో మార్పు రాలేదన్నారు. మన రాష్ట్రం లో 260 మంది అవయవ దానం‌కోసం ముందుకు వచ్చారన్నారు. తెలంగాణలో ఎనిమిది వందల మంది ముందుకు వచ్చారన్నారు. 90 వేల మంది అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.


యేటా ఐదు లక్షల మంది అవయవాలు చెడి‌పోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని సత్య కుమార్ అన్నారు. జాతీయ స్థాయిలో చాలా స్వల్పంగా ఈ అవయవ దానమ రిజిస్ట్రేషన్ లు ఉన్నాయన్నారు. కొంత మందికి మతాచారాలు అడ్డుగా వస్తున్నాయని అంటున్నారన్నారు. తీసుకునేందుకు లేని అభ్యంతరం ఇచ్చేందుకు లేదన్నారు. ఈ దేవుడు అయినా పరులకు మంచి చేయమనే చెబుతారన్నారు. డయాలసిస్ సెంటర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కిడ్నీల మార్పిడి కోసం ప్రజలు చాలా మంది క్యూలో ఉన్నారన్నారు. అవయవ దానం వల్ల అంత్యక్రియలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ అంశాలను సీఎం చంద్రబాబు దృష్టి కి తీసుకెళతానని సత్య కుమార్ పేర్కొన్నారు. అవయవదానం చేసిన వారి అంత్యక్రియల్లో కలెక్టర్, ఎస్పీ పాల్గొని వీరవందనం చేసేలా మార్పులు తెస్తామన్నారు.


ఆర్ధికంగా కూడా ఆ కుటుంబానికి ఎంతో కొంత సాయం అందించాలని సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ మార్పులపై సీఎం సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నానన్నారు. అవయవదానంలో భాగస్వామ్యం అవుతున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఉన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా సమాజంలో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం కలిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సత్యకుమార్ పేర్కొన్నారు. వేల మందికి పునర్జన్మ కలిగించేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. తాను కూడా బాధ్యతగా అవయవదానానికి అంగీకరిస్తూ సంతకం చేశానన్నారు. తన కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇచ్చానని సత్యకుమార్ తెలిపారు

Updated Date - Aug 02 , 2024 | 02:14 PM

Advertising
Advertising
<