రాయలసీమ ద్రోహి జగన్‌: మంత్రి సవిత

ABN, Publish Date - Nov 25 , 2024 | 04:54 AM

ఒక్క చాన్స్‌ పేరుతో ఐదేళ్లు రాష్ర్టాన్ని పాలించిన జగన్‌ రాయలసీమకు చేసిందేమీ లేదని, చివరకు ఆయన రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు.

రాయలసీమ ద్రోహి జగన్‌: మంత్రి సవిత

ఎమ్మిగనూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఒక్క చాన్స్‌ పేరుతో ఐదేళ్లు రాష్ర్టాన్ని పాలించిన జగన్‌ రాయలసీమకు చేసిందేమీ లేదని, చివరకు ఆయన రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన భక్త కనకదాస జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో సవిత మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం రూ.39 వేల కోట్లు కేటాయించిందన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం, పామిడిలో టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. కురుబ సామాజిక వర్గం ఐక్యంగాఉండి రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు.

Updated Date - Nov 25 , 2024 | 04:55 AM