ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సోషల్‌ సైకోలకు మద్దతా?

ABN, Publish Date - Nov 15 , 2024 | 02:56 AM

శాసన మండలిలో సోషల్‌ మీడియా పోస్టులపై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.

వైసీపీ ఎమ్మెల్సీల తీరు సిగ్గుచేటు

మండలిలో మంత్రులు, కూటమి సభ్యుల ఫైర్‌

అరెస్టులపై చర్చించాలని వైసీపీ డిమాండ్‌

అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో సోషల్‌ మీడియా పోస్టులపై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. గురువారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టుల అంఽశంపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. డీఎస్సీపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. రెండింటినీ మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. చర్చించాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ చైర్మన్‌ పోడియం వద్ద, పోడియం పైకి ఎక్కి నిరసన తెలిపారు. వేరే ఫార్మాట్‌లో రావాలని చైర్మన్‌ పదే పదే చెప్పినా వైసీపీ సభ్యులు వినలేదు. సభ్యుల నిరసనల మధ్యే చైర్మన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మండలిలో ప్రజల సమస్యలను ప్రస్తావించాల్సింది పోయి... మహిళల పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టే వారిని సపోర్టు చేస్తారా? అంటూ మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ... సోషల్‌ మీడియా సైకోలకు పెద్దల సభలో వైసీపీ సభ్యులు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. సోషల్‌ మీడియాలో అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతూ మానసిక క్షోభకు గురిచేసిన వారికి మద్దతుగా మాట్లాడటానికి వైసీపీ సభ్యులు మండలికి రావడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని అవమానిస్తుంటే.. అప్పటి సభలో సీఎం హోదాలో ఉన్న జగన్‌ వెకిలి నవ్వులు నవ్వారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోం మంత్రి అనిత కుటుంబ సభ్యులతో పాటు జగన్‌ చెల్లిని కూడా సభ్య సమాజం తలదించుకునేలా సోషల్‌ మీడియాలో వేధించారన్నారు. అటువంటి సోషల్‌ సైకోలకు మద్దతుగా వైసీపీ సభ్యులు మండలి కార్యక్రమాలకు అంతరాయం కలిగించేలా పోడియాన్ని చుట్టుముట్టడం దుర్మార్గపు చర్య అని అభివర్ణించారు. సమాజం తల దించుకునే విధంగా ప్రవవర్తిస్తున్న వైసీపీ సభ్యుల చర్యలు బాధాకరమని గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. మహిళలను కించపరిచే వారిని సమర్థిస్తారా? అంటూ వైసీపీ సభ్యులపై మండిపడ్డారు. అనంతరం యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టాలా లేదా అనేదానిపై చైర్మన్‌కు నిర్ణయాధికారం ఉంటుందన్నారు. సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించి అరెస్టులపై చర్చించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. వాయిదా తీర్మానంకాకుండా వేరే ఫార్మాట్‌లో వస్తే చర్చకు సిద్ధమన్నారు. సోషల్‌ మీడియాలో ఎవరు ఏం చేశారో, ఎవరు చేయించారో అన్నింటిపై చర్చిస్తామన్నారు. మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎంతోమంది యువకులను అరెస్టుచేయడం ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ జరగలేదన్నారు. దీనిపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. అసభ్యంగా పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా వైసీపీ సభ్యులు ఆందోళన చేయడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ సభ్యురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ... మహిళలపై పోస్టులు పెట్టే వారిని సమర్థిస్తారా అంటూ మండిపడ్డారు. మండలి చైర్మన్‌ పదే పదే చెప్పినా వైసీపీ సభ్యులు పోడియం దిగకపోవడంతో సభను వాయిదా వేశారు.

Updated Date - Nov 15 , 2024 | 02:57 AM