ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: ఏపీ స్పీకర్‌పై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Jan 29 , 2024 | 01:35 PM

Andhrapradeshh: అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. స్పీకర్‌ ముందు విచారణకు హాజరయ్యే అంశంపై వైసీపీ ఎమ్మెల్యేలు పలు దఫాలుగా చర్చలు నిర్వహించి చివరకు విచారణకు వెళ్లాలని నిర్ణయించారు.

అమరావతి, జనవరి 29: అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. స్పీకర్‌ ముందు విచారణకు హాజరయ్యే అంశంపై వైసీపీ ఎమ్మెల్యేలు పలు దఫాలుగా సమాలోచనలు జరిపి చివరకు విచారణకు వెళ్లాలని నిర్ణయించారు. కాసేపటి క్రితమే రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. సమావేశం అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA Kotamreddy Sridharreddy) మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammieni Sitharam).. సీఎం జగన్ (CM Jagan) ఆదేశాలతో తమకు నోటీసులిచ్చారని ఆరోపించారు. తాము ఇచ్చిన లేఖకు రసీదు ఇవ్వమన్నా.. స్పీకర్ ఇవ్వడం లేదన్నారు. సహజ న్యాయ సూత్రాలకు అనుసరించి లేఖలిస్తే.. రసీదు ఇచ్చేదే లేదని స్వయంగా స్పీకరే చెప్పారన్నారు. రాజ్యంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ ప్రభుత్వం (YCP Government) కుట్రలకు పూనుకుందని విమర్శించారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా తమపై అనర్హత వేయాలని చూస్తోందన్నారు. చట్టంపై గౌరవంతో స్పీకర్‌ను కలిసి సమయం కావాలని నేరుగా కోరామన్నారు. స్పీకర్ కాకముందు తమ్మినేని వైసీపీలోనే ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో స్పీకర్ తమ్మినేనికి సీటు రాదని వింటున్నామన్నారు. స్పీకర్ విచారణపై తమకు అనుమానం ఉందన్నారు. అందుకే న్యాయ స్థానాలను ఆశ్రయిస్తున్నామని.. ప్రజా కోర్టులో కూడా ఈ వ్యవహరంపై తేల్చుకుంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 29 , 2024 | 01:35 PM

Advertising
Advertising