ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Maddipati Venkata Raju: పంట పొలాలను పరిశీలించిన వెంకట రాజు

ABN, Publish Date - Jul 15 , 2024 | 10:10 AM

ఏపీలో భారీ వర్షాలకు పంటలన్నీ నీట మునుగుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టంతో అతలాకుతలమవుతున్నారు.

తూర్పు గోదావరి: ఏపీలో భారీ వర్షాలకు పంటలన్నీ నీట మునుగుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టంతో అతలాకుతలమవుతున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరం, తెలిక చర్ల, గోపాలపురం మండలం చిట్యాల, వెంకటాయపాలెం గ్రామంలో భారీగా వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే పంటలన్నీ నీటమునిగాయి. పంటలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు.


రైతులతో కలిసి మోటార్ సైకిల్‌పై తిరుగుతూ వెంకట రాజు పంటపొలాలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 80% సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందిస్తామని వెంకట రాజు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కాలవలు, పూడికలు కూడా తీయలేక పోయిందని విమర్శించారు. వచ్చే సంవత్సరానికి కాలువలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Rain Alert: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..

Alwal: నడిరాత్రంతా రోడ్ల మీద తిప్పి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 10:10 AM

Advertising
Advertising
<