ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Keeravani: రామోజీరావుపై బురదజల్లడమంటే..

ABN, Publish Date - Jun 27 , 2024 | 07:00 PM

ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుపై బురదజల్లడమంటే.. నడినెత్తున సూర్యుడిపై వేయడమేనని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అన్నారు. గత ప్రభుత్వ పాలకుల కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట పడిన తర్వాతే ఆయన కన్నుమూశారని తెలిపారు.

MM Keervani, SS RajaMouli

విజయవాడ, జూన్ 27: ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుపై బురదజల్లడమంటే.. నడినెత్తున సూర్యుడిపై వేయడమేనని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అన్నారు. గత ప్రభుత్వ పాలకుల కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట పడిన తర్వాతే ఆయన కన్నుమూశారని తెలిపారు. తనకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది రామోజీరావేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. దేవుడిని నమ్మని రామోజీరావు ఫొటో తన పూజ గదిలో ఉంటుందన్నారు. మద్యపాన నిషేధం ఉద్యమానికి పాటలు రూపకల్పనలో ఆయనందించిన సహకారం మరువలేదని చెప్పారు.


ఇక ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. తెలుగువారి కోసం ఎంతో చేసిన రామోజీరావుకు మనం ఏం చేయగలమన్నారు. రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్జప్తి చేశారు. గురువారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, రాజమౌళి, నిర్మాతలు అశ్విని దత్, సురేశ్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రముఖ నటి జయసుధ, సంగీత దర్శకుడు ఎం ఏం కీరవాణితోపాటు టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా హాజరయ్యారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 27 , 2024 | 07:00 PM

Advertising
Advertising