2 గంటల్లోనే రైతుకు ధాన్యం డబ్బులు
ABN, Publish Date - Dec 01 , 2024 | 05:00 AM
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ఆచంట గోవిందు అనే రైతు 10 ఎకరాల్లో పండించిన వరి పంటను శుక్రవారం రైతు భరోసా కేంద్రానికి విక్రయించాడు.
జగ్గంపేట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ఆచంట గోవిందు అనే రైతు 10 ఎకరాల్లో పండించిన వరి పంటను శుక్రవారం రైతు భరోసా కేంద్రానికి విక్రయించాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ధాన్యం విక్రయించినట్టుగా వేలిముద్ర వేయగా.. ఆ తర్వాత సాయంత్రం 3 గంటల సమయంలో ఆయన బ్యాంకు ఖాతాలో సుమారు రూ.6 లక్షలు జమయ్యాయి. కేవలం రెండు గంటల్లోనే ధాన్యం విక్రయించిన డబ్బులు ఖాతాలోకి పడటంపై రైతు గోవిందు ఆనందం వ్యక్తం చేశారు.
Updated Date - Dec 01 , 2024 | 05:00 AM