ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముసురు ముప్పు

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:38 AM

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో చాగలమర్రి మండలంలో బుధవారం తెల్లవారు తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది.

చాగలమర్రి సర్వీసు రహదారిలో వరి ధాన్యంపై పట్టలు కప్పుతున్న రైతులు

తడిసిన వరి, మినుము, మొక్కజొన్న

ఆందోళనలో అన్నదాతలు

చాగలమర్రి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో చాగలమర్రి మండలంలో బుధవారం తెల్లవారు తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రహదారులు, పొలాల్లో ఆరబెట్టుకున్న వరి, మినుము, మొక్కజొన్న, జూట్‌ ధాన్యం తడిసిపోయింది. మొన్నటి వరకు తుఫాన ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ మరో అల్పపీడనంతో కంటిమీద కునుకులేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి జల్లులు కురవడంతో పంట పొలాలకు వెళ్లి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు రైతులు ట్రాక్టర్లు, ఎద్దులబండ్లతో ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి గృహాలకు చేరవేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని, దీంతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి

ఆదుకోవాలని కోరుతున్నారు.

రాలుతున్న చినుకులు.. ఆవిరవుతున్న ఆశలు

రుద్రవరం: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బుధవారం తుఫాను ప్రభావంతో స్వల్పంగా వర్షం కురిసింది. రైతులు వరి ధాన్యం రాశులపై పట్టలు కప్పడంలో నిమగ్నమయ్యారు. కొండమాయపల్లె నుంచి గాజులపల్లె మెట్ట వరకు వరి ధాన్యం రాశులు రహదారి వెంట కిలోమీటర్ల మేర ఉన్నాయి. కోటకొండ, యల్లావత్తుల టి.కొట్టాల, శ్రీరంగాపురం, చిన్నకంబలూరు ఇంకా పలు గ్రామాల్లో తుఫాను ప్రభావంతో స్వల్పంగా వర్షం కురిసింది. దీంతో రైతులు ట్రాక్టర్లలో వరిధాన్యం బస్తాలు నింపుకుని పంట పొలాల నుంచి గ్రామాలకు తరలిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు గోడౌన్లకు తరలించడంతో గోడౌన్ల వద్ద పదుల సంఖ్యలో ట్రాక్టర్లు బారులుదీరాయి.

Updated Date - Dec 26 , 2024 | 12:38 AM