Nallamilli: నియోజకవర్గంలో పెరుగుతోన్న మద్దతు
ABN, Publish Date - Mar 30 , 2024 | 07:22 PM
అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయించడాన్ని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ క్రమంలో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
నపర్తి, మార్చి30: అనపర్తి అసెంబ్లీ (anaparthy assembly constituency) టికెట్ బీజేపీకి కేటాయించడాన్ని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ క్రమంలో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ (Nallamilli Ramakrishna Reddy referendum) చేపట్టారు. అందులోభాగంగా బిక్కవోలు మండలం పందలపాకలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. తండ్రి మూలారెడ్డి ఫోటోతోపాటు తల్లి సత్యవతిని రిక్షాపై ఎక్కించుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ముందుకు సాగుతున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. తామంతా మీ వెంటేనంటూ.. పందలపాక గ్రామస్తులు టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి ఎదుట స్పష్టం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ కూటమిగా వెళ్తుంది. ఆ క్రమంలో అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో శివకృష్ణంరాజును ఇప్పటికే అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు సైతం తమ తమ పదవులకు ముకుమ్మడి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. ఒకరిద్దరు కార్యకర్తలు అయితే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను వారించిన రామకృష్ణారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఫోన్‌లో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
అయితే కూటమిలో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాంచడం జరిగిందని రామకృష్ణారెడ్డికి చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా భువనేశ్వరి రాజమండ్రి చేరుకున్నారు. ఆ సమయంలో ఆమెతో రామకృష్ణారెడ్డి అనుచరులు భేటీ అయి ఈ అంశంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానంటూ ఆమె హామీ ఇచ్చినట్లు ఓ ప్రచారం సైతం నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తోంది.
మరిన్నీ ఏపీ వార్తలు ఇక్కడ చదవండి..
chandrababu: ‘జగన్‌కు బాగా అర్థమైంది’
Nallamilli: నియోజకవర్గంలో పెరుగుతోన్న మద్దతు
Updated Date - Mar 30 , 2024 | 07:35 PM