ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: మళ్లీ కుప్పం బయలుదేరిన భువనమ్మ

ABN, Publish Date - Apr 18 , 2024 | 01:41 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరపున రెండు సెట్ల నామినేషన్‌ను ఆమె దాఖలు చేయనున్నారు.

Nara Bhuvaneswari

అమరావతి, ఏప్రిల్ 18: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి (nara bhuvaneswari) నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరపున రెండు సెట్ల నామినేషన్‌ను ఆమె దాఖలు చేయనున్నారు.

ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు.. అంటే రేపు ఉదయం కుప్పంలోని వరదరాజులస్వామి వారి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేసి.. ఆ తర్వాత కుప్పంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Venigandla Ramu: గుడివాడను నాని ఎంత అభివృద్ధి చేశారో చేప్పలేము కానీ....

మరోవైపు ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు జన్మదినం. ఈ సందర్బంగా కుప్పం ప్రజల సమక్షంలో జరిగే చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భువనేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. అలాగే సామగుట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం స్థానిక అన్నా క్యాంటీన్‌లో పేదలకు అన్నదానం చేయనున్నారు. రెండు రోజుల పాటు ఆమె కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ క్రమంలో స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆమె సమావేశం కానున్నారు.

అందుకోసం గురువారం నారా భువనేశ్వరి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కుప్పం వెళ్తున్నారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు తెలిపాయి. వైయస్ పాలనకు చరమ గీతం పాడేందుకు బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ కూటమిగా ఏర్పడింది. ఆ క్రమంలో కుప్పం నుంచి కూటమి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు బరిలో దిగుతున్నారు.

ఆంద్రప్రదేశ్ వార్తలు

Updated Date - Apr 18 , 2024 | 01:56 PM

Advertising
Advertising