ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Bhuvaneshwari : నిజం గెలవాలి ముగింపు సభకు చురుగ్గా ఏర్పాట్లు

ABN, Publish Date - Apr 10 , 2024 | 06:11 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం ముగియనుంది. ఏప్రిల్ 13వ తేదీతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అందుకు సంబంధించి విజయవాడలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

Nara Bhuvaneshwari

విజయవాడ ఏప్రిల్ 10: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం ముగియనుంది. ఏప్రిల్ 13వ తేదీతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అందుకు సంబంధించి విజయవాడలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

TDP: నీకు ఓటు అడిగే అర్హత ఉందా?... జగన్‌పై కన్నా విసుర్లు

52 రోజుల తర్వాత ఆయనకు బెయిలు మంజూరు అయింది. అయితే చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకో లేక 206 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలకు తాము అండగా ఉంటామని నారా భువనేశ్వరి ప్రకటించారు. ఆ క్రమంలో నిజం గెలవాలి పేరుతో ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులోభాగంగా.. ఆయా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పి భువనేశ్వరి ఆర్థిక సాయం అందజేశారు.

గత ఆరు నెలలుగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలోని 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. అందుకోసం ఆమె రాష్ట్రవ్యాప్తంగా 8,500 కిలో మీటర్లు ప్రయాణించారు. అయితే ఈ నిజం గెలవాలి ముగింపు సభ ఏర్పాట్లను విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని పర్యవేక్షిస్తున్నారు.

Lok Sabha Polls: తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి లోకేష్.. కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా..

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 10 , 2024 | 06:12 PM

Advertising
Advertising