AP News: జగన్.. నా అన్నాడంటే నాశనమే
ABN, Publish Date - Apr 16 , 2024 | 09:08 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యవహార శైలిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం నిప్పులు చెరిగారు. అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన, మన అనే తేడా వైయస్ జగన్‌కు లేదన్నారు.
అమరావతి,ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యవహార శైలిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం నిప్పులు చెరిగారు. అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన, మన అనే తేడా వైయస్ జగన్‌కు లేదన్నారు.
సింపతీతో ముఖ్యమంత్రి సీటు దక్కించుకోవాలని బాబాయ్ వైయస్ వివేకాను లేపేశాడని చెప్పారు. అదే సమయంలో కోడికత్తి డ్రామాతో దళితులను వేధించాడని విమర్శించారు. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతతో ఓటమి ఖాయమైపోవడంతో గులకరాయి డ్రామాకి సీఎం వైయస్ జగన్ తెర తీశాడని మండిపడ్డారు.
SrirRamaNavami: శ్రీరాముడు శ్రీరాముడే
ఆ క్రమంలో బీసీ బిడ్డలను బలి చేయాలని ఫ్యాన్ పార్టీ అధినేత చూస్తున్నాడని ఆరోపించారు. వైయస్ జగన్ నా
అన్నాడంటే నాశనం చేసేస్తాడని అర్థమని నారా లోకేశ్ అభివర్ణించారు. నా ఎస్సీలు అన్నాడు, వందలాది మందిని బలిచ్చాడని చెప్పారు. నా బీసీలు అన్నాడు, వేలమంది బలైపోయారని పేర్కొన్నారు. ఈ జగన్నాటకానికి జనమే చరమగీతం పాడుతారని నారా లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇటీవల విజయవాడలోని సింగ్ నగర్‌లో సీఎం వైయస్ జగన్.. మేము సిద్దం బస్సు యాత్ర పేరిట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగంతకుడు రెండు రాళ్లు విసరడంతో.. ఒకటి సీఎం వైయస్ జగన్‌కు, మరోక రాయి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు తగిలాయి. ఈ ఇద్దరికీ కంటి ప్రదేశంలోనే గాయం కావడం గమనార్హం.
AP Election 2024: పేరెంట్స్ మీటింగ్ ఎలా పెడతారు.. సీఎం జగన్‌పై వర్లరామయ్య ఫైర్
అయితే ఈ రాయి దాడి ఘటనపై సర్వత్ర విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల వేళ.. అంటే 2018 ఏడాది చివరలో విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కొడికత్తితో వైయస్ జగన్‌పై శ్రీను అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో ఈ కేసును ఎన్ఐఏకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ కోడికత్తి దాడి చేసిన శ్రీను దాదాపు 5 ఏళ్లు పాటు జైల్లోనే ఉన్నాడు. అతడికి ఇటీవల బెయిల్ వచ్చింది.
మరోవైపు ఈ కోడి కత్తి దాడి వెనుక ఎటువంటి కుట్ర లేదని తమ దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ స్పష్టం చేసింది. అలాగే గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు.
ఈ హత్యతోపాటు కోడి కత్తి దాడి సైతం తనపై సీఎం నారా చంద్రబాబు నాయుడే చేయించాడంటూ.. నాటి ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ స్వయంగా ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆ ఎన్నికల్లో వైయస్ జగన్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తింది. అలా అ ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. దీంతో సీఎంగా వైయస్ జగన్ అధికార పీఠాన్ని అందుకున్నారు.
అయితే మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాంటి వేళ... ఎన్నికల ప్రచారంలో ఉన్న వైయస్ జగన్‌పై రాయి విసరడంతో.. మళ్లీ ప్రజల్లో సానుభూతి పొంది ఓట్లు దండుకొనేందుకు వైసీపీ అద్యక్షడు వైయస్ జగన్ మరోసారి తెర తీశారనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం...
Updated Date - Apr 16 , 2024 | 09:08 PM