ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Minister: మంత్రిగా తొలిసారి విశాఖకు నారా లోకేశ్

ABN, Publish Date - Aug 28 , 2024 | 02:09 PM

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నేడు ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తొలిసారిగా మంత్రి నారా లోకేశ్.. జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

అమరావతి, ఆగస్ట్ 28: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నేడు ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తొలిసారిగా మంత్రి నారా లోకేశ్.. జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అందుకోసం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు కీలక నేతలు ఆ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

Also Read: Bangla bandh: బెంగాల్‌లో బంద్ హింసాత్మకం.. నలుగురు అరెస్ట్


సాయంత్రం విశాఖకు చేరుకోనున్న లోకేశ్..

ఈ రోజు సాయంత్రం మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో భారీ ర్యాలీగా రాక్ డెల్‌లోని లే అవుట్‌లోని పార్టీ కార్యాలయానికి వెళ్తారు. ఈ రోజు రాత్రి పార్టీ కార్యాలయంలోనే ఆయన బస చేయనున్నారు. 29వ తేదీ ఉదయం సాక్షి కథనంపై ఆయన కోర్టుకు హాజరవుతారు.

Also Read: Himachal Pradesh: కంగన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం


30 లేదా 31 ఉదయం..

అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని.. పార్టీ కేడర్‌తో సమావేశం కానున్నారు. ఇక 30వ తేదీన జిల్లాలోని పలు పాఠశాలలను నారా లోకేశ్ సందర్శించనున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం జిల్లా ఉన్నతాధికారులతో సైతం ఆయన సమావేశం కానున్నారు. అదే రోజు రాత్రి లేకుంటే ఆగస్ట్ 31వ తేదీ ఉదయం విశాఖపట్నం నుంచి రాజధాని అమరావతికి నారా లోకేశ్ పయనమవనున్నారు.

Also Read: Modi Cabinet: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక పరిణామం


కోర్టుకు లోకేశ్ ఎందుకు..?

తనపై అసత్య కథనాలను ప్రచురించిన సాక్షి దిన పత్రికపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయ పోరాటానికి దిగారు. చిన‌బాబు చిరుతిండి.. రూ. 25 ల‌క్ష‌లండి పేరుతో సాక్షి దిన పత్రికలో ప్రచురించిన అస‌త్య క‌థ‌నంపై నారా లోకేష్ స్పందించారు. ఈ కథనంపై న్యాయ‌ పోరాటం చేయాలని ఆయన నిర్ణయించారు. అందులోభాగంగా ఈ కథనంపై కోర్టులో మంత్రి నారా లోకేశ్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో ఆగస్ట్ 29వ తేదీన విశాఖపట్నం 12వ అదనపు జిల్లా కోర్టుకు మంత్రి నారా లోకేశ్ హాజ‌రు కానున్నారు.

AP Politics: మోపిదేవి బాటలో మరో ఎంపీ..ఎవరతను


పక్కా అవాస్త‌వాల‌తో ఉద్దేశ‌ పూర్వ‌కంగా త‌న‌ను డ్యామేజ్ చేయాల‌ని ఈ కథనం వేశారంటూ నారా లోకేశ్.. తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. సత్య దూరమైన ఈ వార్త కథనంపై సాక్షి దిన పత్రిక ఎటువంటి వివరణ వేయకపోవడంతోపాటు తాను జారీ చేసిన నోటీసులపై సైతం స్పందించక పోవడంతో మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన పరువునకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారంటూ మంత్రి నారా లోకేశ్.. కోర్టును ఆశ్రయించారు.

Also Read: Jammu Kashmir Assembly Polls: తండ్రి తరఫున నామినేషన్ వేసిన సుగ్రా బర్కతి

అలాగే ఈ కథనాల్లో స్పష్టం చేసినట్లు.. ఆ యా తేదీల్లో తాను విశాఖపట్నంలోనే లేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన మర్యాదల కోసం చేసిన ఖ‌ర్చుని త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ప్ర‌తిష్ట‌ని మంట‌గ‌లిపేందుకు ప్ర‌య‌త్నించారంటూ ఈ సందర్భంగా నారా లోకేశ్.. కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

Also Read: Dengue Fever: డెంగ్యూ .. ప్లాస్మా లీకేజీ.. జర జాగ్రత్త


గతంలో తాను పలుమార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలను తాను స్వీకరించ లేదని కోర్టుకు నారా లోకేశ్ తెలిపారు. వివిధ కార‌ణాల‌తో గత కొద్ది రోజులుగా వాయిదాలు మీద వాయిదాలు పడిన ఈ కేసు రేపు.. అంటే ఆగస్ట్ 29వ తేదీన మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్‌తో మ‌ళ్లీ మొద‌లుకానుంది.

Also Read: Nagpur: నగదు కోసం శిశువు విక్రయం: ఆరుగురు అరెస్ట్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2024 | 03:04 PM

Advertising
Advertising
<