నవరత్నాల రథోత్సవం
ABN , Publish Date - Feb 24 , 2024 | 11:37 PM
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు నవరత్నాల రథం పై రమణీయంగా ఉరేగారు.

మంత్రాలయం, ఫిబ్రవరి 24: రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు నవరత్నాల రథం పై రమణీయంగా ఉరేగారు. శనివారం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆఽధ్వర్యంలో బృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు హస్తోధకం చేసి మహా మంగళహారతులు ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య నవరత్నాల స్వర్ణ రథం పై వజ్రాలు పొదిగిన ప్రహ్లదరాయులను అధిష్టించి శ్రీమఠం ప్రాంగాణ ం చుట్టూ రమణీయంగా ఊరేగించారు. అనంతరం ఊంజలసేవలో ఉత్సవ మూర్తిని అధిష్టించి ఊయలలో ఊగించారు. ఇది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
భక్తుల కోలాహలం
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. శనివారం దక్షణాది రాష్ర్టాలనుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగాణం భక్తులతో కిక్కిరిసింది. మఠం అతిధి గృహలు, ప్రైవేట్ లాడ్జీలు భక్తులతో నిండిపోయాయి. అద్దె రూములు దొరకక మధ్వమార్గ్ కారిడార్ ముందే భక్తులు బసచేశారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.