Teenager Kills His Cousin : 5 ఏళ్ల చిన్నారిని హత్య చేసిన.. 13 ఏళ్ల కుర్రాడు.. దేనికోసమో తెలిస్తే..
ABN , Publish Date - Mar 03 , 2025 | 11:31 AM
Mumbai Teenager : అభం శుభం తెలియని ఓ ఐదేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హత్య చేశాడు.. ఓ టీనేజర్.. ఈ కారణం వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులకు చెప్పడంతో షాక్ అవుతున్నారు పోలీసులు..

Mumbai Teenager Kills His Cousin : ఇంట్లో వాళ్లు, బంధువులు తనను పట్టించుకోవడంలేదని ఓ టీనేజర్ అభద్రతాభావం.. అసూయతో రగిలిపోయేలా చేసింది. 5 ఏళ్ల చిన్నారిని అమానుషంగా హత్య చేసేలా పురికొల్పింది. నా పై ఎవరూ ప్రేమగా ఉండటం లేదు.. తననే ముద్దు చేస్తున్నారనే మనస్తాపంతో కుంగిపోయి దారుణచర్యకు పాల్పడ్డాడు ముంబయికి చెందిన ఓ 13 ఏళ్ల కుర్రాడు. ఆడుకుందాం రమ్మంటూ అక్కడకు తీసుకెళ్లి.. ఆ తర్వాత ఇలా..
ఆడుకుందాం రమ్మని పిలిచి..
ఆరేళ్ల వయసున్న బంధువులమ్మాయి.. తన కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించడం నలసోపారాకు చెందిన 13 ఏళ్ల బాలుడి మనసుని విషపూరితం చేసింది. అతడిలో మేల్కొన్న అసూయాభావం చిన్నపాపను హత్య చేయాలనే దురాలోచనను మనసులో మొలకెత్తించింది. ప్లాన్ ప్రకారం గత శనివారం ఆమెను ఆడుకుందాం రమ్మని పిలిచి ఒక కొండపై ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. గొంతుకోసి చంపాక కూడా పగ తీరక ఒక రాయితో ఆమె తలను నుజ్జు నుజ్జు అయ్యేలా చేశాడని పోలీసులు వెల్లడించారు.
వారిద్దరు వచ్చి కిడ్నాప్ చేశారు..
మృతి చెందిన చిన్నారి శిద్ర ఖాతున్, మొహమ్మద్ సల్మాన్ మొహమ్మద్ రంజాన్ ఖాన్ (33) ఇద్దరు కుమార్తెలలో చిన్నది. వీరి కుటుంబం వాసాయి తూర్పులోని శ్రీరామ్ నగర్‌లో నివసిస్తుంది. నిందితుడి తల్లి శిద్ర ఖాతున్ సోదరి సోదరి. ఇరు కుటుంబాలు పక్క పక్కనే నివసిస్తున్నాయి. ఆడుకోవడానికి వెళ్లిన కుమార్తె ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఖాన్. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, నిందింత బాలుడు చిన్నారిని చివరగా తీసుకెళ్లడం కనిపించింది. దీంతో బాలుడిని ప్రశ్నించగా.. ఆడుకోవడానికి వెళ్లినపుడు ఇద్దరు ఆగంతకులు వచ్చి పాపను కిడ్నాప్ చేశారని నమ్మబలికేందుకు ప్రయత్నించాడు. పోలీసులు గట్టిగా అడగడంతో అసలు విషయం బయటపెట్టాడు.
బాలుడి కుటుంబీకులు చిన్నారితో చనువుగా మెలగడం సహించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని వెంటనే అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు పంపారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు వెల్లడించారు.
Read also : Chittoor: కూతురి జ్ఞాపకాలు మరవలేక.. రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య
Hyderabad: నా అన్నతో కలిసి తిరిగితే చంపేస్తానంటూ యువతిపై దాడి..
Hyderabad: అశోకా హోటల్‌కు బాంబు బెదిరింపు..