ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ఇసుక రీచ్‌లలో భారీగా ధరల పెంపు.. ఆందోళనకు సిద్ధమైన కోటంరెడ్డి

ABN, Publish Date - Jan 23 , 2024 | 10:13 AM

Andhrapradesh: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని ఇసుక రీచ్‌లో అనధికారికంగా ధరలు భారీగా పెరిగాయి. ప్రతీ టిప్పుకు ట్రాక్టర్‌కు రూ.500లు, టిప్పర్‌కు రూ‌.2 వేలు చెల్లించాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.

నెల్లూరు, జనవరి 23: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని ఇసుక రీచ్‌లలో అనధికారికంగా ధరలు భారీగా పెరిగాయి. ప్రతీ ట్రిప్పుకు ట్రాక్టర్‌కు రూ.500లు, టిప్పర్‌కు రూ‌.2 వేలు చెల్లించాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. తామేమీ ధరలు పెంచలేదని.. ప్రభుత్వ పెద్దల నుంచే ఆదేశాలు వచ్చాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇసుక రీచ్‌ల వద్ద నిర్వాహకులు, వాహనదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.


ఆందోళనకు రెడీ..

ఈ విషయంపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Rural MLA Kotamreddy Sridhar Reddy) స్పందించారు. ధరల పెంపుకు నిరసనగా పల్లెపాడు ఇసుక రీచ్‌లో నేడు (మంగళవారం) ఆందోళన చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డి రాబోతున్నారని తెలుసిన నిర్వాహకులు నేడు ఇసుక రీచ్‌ను మూసివేశారు. రూ.కోట్లలో అధికంగా అక్రమ వసూళ్లకి పాల్పడితే పోరాటం తప్పదని ఎమ్మెల్యే కోటంరెడ్డి హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 23 , 2024 | 04:39 PM

Advertising
Advertising