ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nellore: డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లీలలు

ABN, Publish Date - Dec 05 , 2024 | 08:53 AM

క్వార్ట్జ్ కుంభకోణంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూప్ కుమార్ కోసం... డిప్యూటీ డైరెక్టర్‌ డిజిటల్‌ సిగ్నేచర్‌నే గప్‌చుప్‌గా తొలగించేశారు. కింది స్థాయి అధికారితో ఫైల్‌ అప్‌లోడ్‌ చేయించారు. ఎక్కడో తేడా కొట్టిందనే అనుమానంతో తెల్లారేసరికి అనుమతులు రద్దు చేశారుగానీ... లేకపోతే ఈ పాటికి రూప్‌ కుమార్‌ గనుల్లో ‘అధికారికం’గా తవ్వకాలు మొదలయ్యేవి.

నెల్లూరు: క్వార్ట్జ్ కుంభకోణం (Quartz Scandal)లో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ (Deputy Mayor, Roop Kumar) లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పదిరోజుల కిందట నాలుగు క్వారీలకు అనుమతులు ఇచ్చారు. అయితే అది తేడా కొట్టడంతో తెల్లవారే సరికి అనుమతులు రద్దు చేశారు. మైనింగ్ శాఖ రిటైర్డ్ అధికారి కీలకపాత్ర పోషించారు. డీడీని తప్పించి ఆర్ఐతో డిజిటల్ సంతకాలు చేయించారు. వైసీపీ హయాంలో భారీ ఎత్తున అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు జరిగాయి. తెలంగాణ పర్మిట్లతో అక్రమ రవాణా చేశారు. కూటమి ప్రభుత్వంలోనూ రూప్ కుమార్ దందా సాగించారు. గంపగుత్తుగా రూ. వేల కోట్ల క్వార్ట్జ్‌పై కన్నేసిన ఆయన.. గత ఎన్నికలకు నెలరోజులు ముందు టీడీపీలో చేరారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనూ రూప్ కుమార్ చక్రం తిప్పుతున్నారు.


రూప్ కుమార్ కోసం... డిప్యూటీ డైరెక్టర్‌ డిజిటల్‌ సిగ్నేచర్‌నే గప్‌చుప్‌గా తొలగించేశారు. కింది స్థాయి అధికారితో ఫైల్‌ అప్‌లోడ్‌ చేయించారు. ఎక్కడో తేడా కొట్టిందనే అనుమానంతో తెల్లారేసరికి అనుమతులు రద్దు చేశారుగానీ... లేకపోతే ఈ పాటికి రూప్‌ కుమార్‌ గనుల్లో ‘అధికారికం’గా తవ్వకాలు మొదలయ్యేవి. ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు టీడీపీలో చేరిన ఈ ద్వితీయ శ్రేణి నాయకుడికి ఎందుకింత ప్రాధాన్యం.. నెల్లూరు జిల్లాలో పదకొండు మంది టీడీపీ ఎమ్మెల్యేలు, అందులో ఇద్దరు మంత్రులు ఉండగా... నెల్లూరు నగర డిప్యూటీ మేయర్‌ హవా నడవడమేమిటి.. వైసీపీ అధికారంలో ఉండగా అబ్బాయ్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌... ఇప్పుడు ఆయన బాబాయ్‌ రూప్‌కుమార్‌ క్వార్ట్జ్‌ గనుల్లో చక్రం తిప్పుతుండటంపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. గనుల శాఖతో సంబంధమున్న ఒక రిటైర్డ్‌ అధికారి అండతోనే రూప్‌కుమార్‌ ఇంతగా రెచ్చిపోతున్నట్లు తెలిసింది. తన అధీనంలోని గనుల్లో తవ్వకాల పునరుద్ధరణకు ఒక డిప్యూటీ డైరెక్టర్‌ను తప్పించేసి, ఫైలుపై ‘షార్ట్‌ కట్‌’లో దిగువ స్థాయి అధికారితో సంతకం చేయించినట్లు తెలిసింది.

ఆ నాలుగూ...

రూప్‌కుమార్‌ యాదవ్‌ ఆధీనంలోని నాలుగు క్వారీల్లో వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల విలువైన క్వార్డ్జ్‌ తవ్వకాలు జరిగాయి. చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి. కూటమి సర్కారు వచ్చాక... జిల్లాలో క్వార్డ్జ్‌, సిలికా గనుల లీజులను పొడిగించాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం, అన్ని గనులను తనిఖీ చేసి వాటి పరిధిలో జరిగిన తవ్వకాలు, విక్రయాలు, పర్మిట్లు తదితరాలను క్షుణంగా పరిశీలించాలని భావించింది. ఈ ఏడాది ఆగస్టులో ప్రకాశం, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన మైనింగ్‌ ఉద్యోగులు నాలుగు బృందాలుగా విడిపోయి... నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్వార్డ్జ్‌, సిలికా గనులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే... సైదాపురం మండలంలో రూప్‌కుమార్‌విగా చెప్పుకొంటున్న నాలుగు క్వారీల్లో మాత్రం ఒక్క అధికారీ అడుగు పెట్టలేదు. రిటైర్డ్‌ అధికారి ‘సూచనల’ మేరకు... అప్పటి డిప్యూటీ డైరెక్టర్‌ ఈ మేరకు ‘జాగ్రతలు’ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.


‘తప్పుడు’ సంకేతం

తనిఖీల ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత డీడీ బదిలీపై వెళ్లిపోయారు. సెప్టెంబరు 29న కొత్తగా చంద్రశేఖర్‌ అనే అధికారి ఆ బాధ్యతలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న క్వార్డ్జ్‌ నిక్షేపాలను సొంతం చేసుకోవాలనే వ్యూహంతో రంగంలోకి దిగిన రూప్‌కుమార్‌... తొలుత తన ఆధీనంలో నడుస్తున్న నాలుగు క్వారీలకు అనుమతుల కోసం అమరావతికి ఫైలు పెట్టమని డీడీని కోరినట్లు తెలిసింది. అయితే, నాలుగు క్వారీలను తనిఖీ చేసిన తర్వాతే ఫైలు పంపుతానని చంద్రశేఖర్‌ తెగేసి చెప్పారు. ఫైలును ఆమోదిస్తూ ఆయన డిజిటల్‌ సిగ్నేచర్‌ చేస్తేకానీ పని జరగదు. దీంతో అదను కోసం వేచి చూశారు. గతనెల 26న డీడీ చంద్రశేఖర్‌ హైకోర్టు పని నిమిత్తం అమరావతికి వెళ్లినప్పుడు... గుట్టు చప్పుడు కాకుండా ఆయన డిజిటల్‌ సిగ్నేచర్‌ (థంబ్‌, డాంగిల్‌) ఆథరైజేషన్‌ను తీసేశారు. మైనింగ్‌ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ ద్వారా అప్పటికప్పుడు ఫైలును అప్‌లోడ్‌ చేయించారు. మరుసటి రోజు విధుల్లోకి వచ్చిన డీడీ ఇది చూసి విస్తుపోయారు. అసలేం జరిగిందని కార్యాలయంలో ఆరా తీశారు. ఆయన అక్కడే, అదే పదవిలో ఉంటే తమకు ముప్పు అని భావించి... నవంబరు 30వ తేదీన ఆయనను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. గనుల శాఖతో సంబంధమున్న రిటైర్డ్‌ అధికారి సూచనల మేరకు ప్రస్తుతం సర్వీసులో ఉన్న మరో అధికారి ద్వారా ఈ తతంగాన్ని నడిపించారు. అయితే, జిల్లా నుంచి ఫైలు రాగానే ప్రధాన కార్యాలయంలో దానిని ఆమోదించారు. రూప్‌కుమార్‌కు చెందిన నాలుగు గనులను పది రోజుల కిందట పునరుద్ధరించారు. దీని వెనుక భారీగా అక్రమాలు జరిగినట్లు సమాచారం రావడంతో తెల్లవారేసరికి అనుమతులను రద్దు చేశారు.

భారీగా అక్రమాలు...

అన్నీ సక్రమంగా ఉంటే తనిఖీలకు భయపడాల్సిన అవసరమే ఉండదు. కానీ... రూప్‌ కుమార్‌ ఆధీనంలోని నాలుగు గనుల్లో వైసీపీ హయాంలోనే విచ్చలవిడిగా తవ్వకాలు జరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణ నుంచి తప్పుడు పర్మిట్లు తెప్పించుకొని ఇక్కడి నుంచి క్వార్డ్జ్‌ తవ్వి తరలించారని అంటున్నారు. ఇప్పుడు గనుక ఆ నాలుగు క్వారీలను పక్కాగా తనిఖీ చేస్తే అసలు విషయం బయట పడుతుంది. కోట్లాది రూపాయల పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అందుకే... రిటైర్డ్‌ అధికారి అండతో తనిఖీల నుంచి తప్పించుకుని, ఆ తర్వాత మరో అధికారి సంతకంతో ఫైలు పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరి నిమిషంలో ఉన్నతాధికారులు మేల్కోవడంతో... ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభుత్వ చర్యలపై లోకాయుక్త సంతృప్తి

సీఎం చంద్రబాబుకు రామకృష్ణ లేఖ

బీఫ్ వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 05 , 2024 | 08:53 AM