AP News: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న క్వార్ట్జ్ మాఫియా గ్యాంగులు
ABN, Publish Date - Feb 13 , 2024 | 09:38 AM
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ మాఫియా గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. సీమ ప్రాంతానికి చెందిన ‘పెద్ద’ మంత్రి, నెల్లూరు జిల్లాకి చెందిన మంత్రి, మాజీ మంత్రి రౌడీ గ్యాంగులు హల్ ఛల్ చేస్తున్నాయి. భారీ ఎత్తున వందల కోట్ల రూపాయల క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ మాఫియా గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. సీమ ప్రాంతానికి చెందిన ‘పెద్ద’ మంత్రి, నెల్లూరు జిల్లాకి చెందిన మంత్రి, మాజీ మంత్రి రౌడీ గ్యాంగులు హల్ ఛల్ చేస్తున్నాయి. భారీ ఎత్తున వందల కోట్ల రూపాయల క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వాటిని చెన్నైకి రవాణా చేస్తున్నారు. క్వారీల లీజుదారులను తీవ్రస్థాయిలో బెదిరించి.. క్వారీల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భూముల్లో తిష్ట వేస్తున్నారు. టోల్ గేటు వద్ద లారీలను అనధికార తనిఖీలు చేసి విడిచిపెడుతున్నారు. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చేతిలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మైనింగ్ శాఖ రాష్ట్ర అధికారులు రెండు సార్లు ఈ టెండర్లు పిలిచి రద్దు చేశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకి భారీగా గండి పడుతోంది.
Updated Date - Feb 13 , 2024 | 09:38 AM