SSLV-D3 Rocket: ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగం.. కౌంట్‌డౌన్ స్టార్ట్
ABN, Publish Date - Aug 15 , 2024 | 11:16 AM
షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగాన్ని రేపు(శుక్రవారం) ఉదయం 9.17 గంటలకు నింగిలోకి పంపిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం ప్రారంభించినట్లు చెప్పారు.
ఉమ్మడి నెల్లూరు: షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను రేపు (శుక్రవారం) ఉదయం 9.17 గంటలకు నింగిలోకి లాంచ్ చేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఈఓఎస్ -08 శాటిలైట్ పంపనున్నట్లు వివరించారు. ఈవోఎస్ -08 ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని స్పష్టం చేశారు. ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇవాళ అర్ధరాత్రి ఎస్‌ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు.
నవంబర్‌లో గగన్‌యాన్ రాకెట్ ప్రయోగం చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాదిలో పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుందని అన్నారు. నాసా వారి నిస్సార్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.
ఈ ఏడాది నవంబర్‌లో నావిక్ శాట్ ప్రయోగం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎం కె3, ఎల్వీఎం 3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలు పంపనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కాలంలో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్ అదే విధంగా టెక్నాలజీ డెవలప్‌మెంట్ శాటిలైట్, టీడీఎస్ రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
Updated Date - Aug 15 , 2024 | 11:26 AM