AP News: నెల్లూరులో మరో రాజప్రసాదం నిర్మించిన జగన్
ABN, Publish Date - Jun 23 , 2024 | 09:07 AM
గత జగన్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నెల్లూరులోనూ పార్టీ కార్యాలయం పేరిట జగన్ ఒక రాజప్రసాదాన్ని నిర్మించారు. జనార్ధన్ రెడ్డి కాలనీలో గతంలో పేదల టిడ్కో ఇళ్ల కోసం కేటాయించిన 2 ఎకరాల భూమిని జగన్ పార్టీ స్వాహా చేసింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నెల్లూరులోనూ పార్టీ కార్యాలయం పేరిట జగన్ ఒక రాజప్రసాదాన్ని నిర్మించారు. జనార్ధన్ రెడ్డి కాలనీలో గతంలో పేదల టిడ్కో ఇళ్ల కోసం కేటాయించిన 2 ఎకరాల భూమిని జగన్ పార్టీ స్వాహా చేసింది. 33 ఏళ్లపాటు ఎకరాకి ఏడాదికి కేవలం రూ.వెయ్యి లీజుకి జగన్ సర్కార్ అప్పగించింది.
ఇక అనుమతులు లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా రాజప్రసాదం నిర్మించారు. విషయం తెలిసి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వైసీపీ అక్రమాలకు సంబంధించి విశాఖ, అనకాపల్లి ఆఫీసులకూ అధికారులు నోటీసులు జారీ చేశారు. 17 ఎకరాల బోటుయార్డు భూముల స్వాహాకు కూడా కుట్ర పన్నారు. పార్టీ ఆఫీసు కోసం రెండెకరాలు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. ఇక ఎన్నికల ముంగిట ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. కార్పొరేషన్ అనుమతి, సీఆర్‌డీఏ పర్మిషన్లూ లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటిపై హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఊరట లభించోద్గ. చట్టబద్ధంగా వ్యవహరించాలని అధికారులను కోర్టు ఆదేశించింది.కాగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చంద్రబాబుకు ఆపాదించేందుకు జగన్ రాజకీయం మొదలుపెట్టారు.
Updated Date - Jun 23 , 2024 | 09:07 AM