ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: చంద్రబాబు రివ్యూలో కబ్జా పర్వంపై ఓపెన్ అయిన అధికారులు

ABN, Publish Date - Jul 31 , 2024 | 02:03 PM

పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు.

అమరావతి: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకు పాల్పడడంతో భూ కేటాయింపులు జరిగిన తరువాత కూడా పలు కంపెనీలు వెళ్లిపోయాయన్నారు. ఇండస్ట్రీ కోసం కేటాయించిన భూముల కబ్జాలతో పాటు.. అధికార దుర్వినియోగం జరిగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రం నుంచి విడిచిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా తాను మాట్లాడుతానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఉన్న భూముల లభ్యత.. ఏఏ ప్రాంతాలు ఇండస్ట్రియల్ క్లస్టర్స్‌కు అనుకూలం అనే అంశాలపై చర్చ జరగనుంది. రివ్యూ కొనసాగుతోంది. మంత్రులు టిడి భరత్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.


కాగా అంతకు ముందు.. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుప్పం వైసీపీ నేతలు.. టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. కుప్పం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని వైసీపీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. త్వరలోనే కుప్పం నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారన్నారు. గత ఐదు సంవత్సరాలుగా కుప్పంలో ఎలాంటి అరాచకాలు చోటుచేసుకున్నాయో అందరికీ తెలుసన్నారు. కుప్పంలో వైసీపీ అవినీతి అరాచకాలపై విచారణ జరుగుతుందని శ్రీకాంత్ తెలిపారు.


కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ. 250 కోట్లు కేటాయించారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ తెలిపారు. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే నీటిని నిలువ చేయడానికి 500 కోట్లతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. కుప్పంలో 2000 ఎకరాలతో సెజ్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైతే తటస్థులుగా ఉండి కుప్పం అభివృద్ధిని కోరుకుంటున్నారో వారందరినీ టీడీపీలోకి ఆహ్వానిస్తామని కంచర్ల శ్రీకాంత్ వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నామినేటెడ్ పోస్టులు వారికే: సీఎం చంద్రబాబు

గవర్నర్‌గా నేడు జిష్ణు దేవ్ వర్మ ప్రమాణస్వీకారం

బినామీ పేర్లతో పెద్దిరెడ్డి భూముల రిజిస్ట్రేషన్‌..

మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లు..

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 31 , 2024 | 02:03 PM

Advertising
Advertising
<