ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Palla Srinivasa Rao: కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు చర్యలు

ABN, Publish Date - Jun 28 , 2024 | 06:40 PM

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ.. దండ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై పెట్టిన కేసులను సాధ్యమైనంత త్వరగా ఎత్తి వేసేలా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

AP TDP Chief Palla Srinivas Rao

అమరావతి, జూన్ 28: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ.. దండ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై పెట్టిన కేసులను సాధ్యమైనంత త్వరగా ఎత్తి వేసేలా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో కేడర్‌ను ఉద్దేశించి పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు మధ్య వారధిలా తాను పని చేస్తానని స్పష్టం చేశారు. గతంలో కార్యకర్తలను నిర్లక్ష్యానికి గురి చేసేవారని.. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఉండవన్నారు.


పార్టీలో యువ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ సీనియర్ల సహాయ సహకారాలతో తనకిచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనన్నారు. తనపై టిడిపి గురుతరమైన బాధ్యత ఉంచిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర కార్యాలయంలో నిరంతరం ఓ మంత్రి అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తానని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. 2024లో కార్యకర్తలు ఏ స్ఫూర్తితో పని చేశారో అదే స్ఫూర్తి 2029 ఎన్నికల వరకు కొనసాగుతుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

For AP News and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 06:40 PM

Advertising
Advertising