ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: ప్రజారాజ్యం నుంచి ఏపీ మంత్రిగా.. పవన్ కళ్యాణ్ ‘పవర్’ జర్నీ

ABN, Publish Date - Jun 12 , 2024 | 01:26 PM

రాజకీయాల్లో రాణించడం అంటే.. అంతా మామూలు విషయం కాదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా సరే.. పాలిటిక్స్‌లో ఎదగాలంటే మాత్రం చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ముందుగా జనాల...

Pawan Kalyan Journey From Praja Rajyam To AP Minister

రాజకీయాల్లో రాణించడం అంటే.. మామూలు విషయం కాదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా సరే.. పాలిటిక్స్‌లో ఎదగాలంటే మాత్రం చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ముందుగా జనాల మనసుల్లో ఒక స్థానం సంపాదించాలి. ఎంతటి అవమానాలనైనా భరించగలగాలి. కష్టనష్టాలను ఎదురించి నిలవగలగాలి. ఒక అడుగు ముందుకు వేసేకొద్దీ.. రెండు అడుగులు వెనక్కు లాగే అజ్ఞాత శత్రువుల్ని ఎదుర్కోగలగాలి. ఎటువంటి సమస్యలొచ్చినా వాటిని అధిగమించి ‘సైరా’ అంటూ సాగిపోవాలి. మరీ ముఖ్యంగా.. ఓర్పు, నేర్పు ఉండాలి. అప్పుడే.. నిర్దేశించుకున్న గమ్యానికి చేరుకోవచ్చు, అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు.


పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం కూడా ఇలాగే సాగింది. ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో.. తన కెరీర్‌ని పణంగా పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక్కడ భరించలేని అవమానాలు ఎదురవుతాయని తెలిసినా.. తన అన్నయ్యకు అండగా ప్రజారాజ్యం పార్టీ తరఫున 2008లో ప్రచారకర్తగా రంగంలోకి దిగారు. విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు. కానీ.. ప్రజారాజ్యం పార్టీకి ప్రజల ఆశీర్వాదం దక్కకపోవడంతో పవన్ వెనకడుగు వేశారు. అటు.. చిరంజీవి సైతం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో, పవన్ రాజకీయాలకు దూరం అయ్యారు. అప్పుడు ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ప్రజాసేవ సరే గానీ, పాలిటిక్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వకపోవచ్చని అందరూ భావించారు. ఇక సినిమాలకే పరిమితం అవ్వొచ్చని అనుకున్నారు.


కానీ.. అందరి అంచనాలను తిప్పికొడుతూ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ, టీడీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. అయితే.. 2019లో మాత్రం టీడీపీ నుంచి విడిపోయి సోలోగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటునే కైవసం చేసుకుంది. పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేయగా.. రెండింటిలోనూ ఓటమి చవిచూశారు. అయితే.. ఏపీలో రాక్షసరాజ్యం రాజ్యమేలడాన్ని చూసి ఓర్వలేకపోయిన పవన్.. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. 72,279 ఓట్ల మోజార్టీతో గెలుపొందారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి.. తన పవర్‌ఫుల్ జర్నీతో ఇతరులకి ఆదర్శంగా నిలిచారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 01:38 PM

Advertising
Advertising