pawankalyan: ‘భారీ మెజార్టీతో గెలవబోతున్నాం’
ABN, Publish Date - Mar 31 , 2024 | 07:43 PM
వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టడమే మన ముందున్న ఏకైక లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అందుకోసం రాబోయే 40 రోజులు మండల దీక్ష చేసినట్లుగా నిష్టగా పని చేద్దామని నియోజకవర్గంలోని కూటమి శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు.
కాకినాడ, మార్చి 31: వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టడమే మన ముందున్న ఏకైక లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. అందుకోసం రాబోయే 40 రోజులు మండల దీక్ష చేసినట్లుగా నిష్టగా పని చేద్దామని నియోజకవర్గంలోని కూటమి శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. ఆదివారం పిఠాపురం నియోజకవర్గం (pittapuram assembly constituency)లోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమన్వయ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తు కోసం తపించానని తెలిపారు.
రాబోయేది కూటమి ప్రభుత్వమేనని... భారీ మెజార్టీతో సీట్లు గెలవబోతున్నామని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయట పడేయాలనే పొత్తులు పెట్టుకున్నట్లు వివరించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. తమకు ఎంపీ స్థానాలు ఎక్కువ కావాలని కోరారని.. దీంతో జనసేన రెండు లోక్‌సభ స్థానాలకే పరిమితమైందని వివరించారు.
బీజేపీ పెద్దల మనోభీష్టాన్ని కాదనకుండా ముందుకు వెళ్లామని ఆయన చెప్పుకొచ్చారు. 80 శాతం మంది పొత్తుకు అంగీకరించారని తెలిపారు. బీజేపీ, టీడీపీ బలమైన పునాదులు కలిగిన పార్టీలని చెప్పారు. అయితే సమూహాన్ని క్రమశిక్షణతో నడిపించే మెకానిజం ఇంకా జనసేన పార్టీ పాదించ లేదన్నారు. మనకు యువబలం, పోరాడేతత్వం మెండుగా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే
చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు బాధేసిందన్నారు. వైసీపీ అకారణంగా ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు చాలా బాధపడ్డానని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజమండ్రి వెళ్తున్నపుడు దారి పొడవునా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ నాయకుడి కోసం పడిన తపన.. తనను కదిలించిందన్నారు.
అందుకే రాజమండ్రి జైల్లో చంద్రబాబుని కలిసిన తరువాత తన వంతుగా ఏదైనా చేయాలి నిర్ణయించుకొన్నానన్నారు. వైసీపీ పాలనను తరిమికొట్టాలని ఈ సందర్బంగా ప్రజలకు పవన్ పిలుపు నిచ్చారు. వైసీపీ దోపిడీ అరికడితేనే సంక్షేమ పథకాలు అప్పులు లేకుండానే అమలు చేయవచ్చని ఆయన పునరుద్ఘాటించారు.
మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Chandrababu: జగన్ దుమ్ము దులిపిన చంద్రబాబు
‘భారీ మెజార్టీతో గెలవబోతున్నాం’
Updated Date - Mar 31 , 2024 | 07:56 PM