ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: మా మీద జగన్‌కి విపరీతమైన కోపం

ABN, Publish Date - Apr 17 , 2024 | 08:24 PM

వైసీపీ అధినేత వైయస్ జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. బుధవారం పెడనలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోపాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

pawan kalyan

పెడన, ఏప్రిల్ 17: వైసీపీ అధినేత వైయస్ జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. బుధవారం పెడనలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోపాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తన నియోజకవర్గాన్ని భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మార్చుకున్నారంటూ సీఎం వైయస్ జగన్‌తోపాటు ఆయన పార్టీ నేతలు తనను ప్రశ్నిస్తున్నారన్నారు.

AP Election: ఆంధ్రా ఓటరు ఎటు వైపు..?

అయితే పెడన ఎమ్మెల్యేతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను నీవు ఎందుకు మార్చావంటూ సీఎం వైయస్ జగన్‌‌ను ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. వైయస్ జగన్ మాట్లాడితే.. క్లాస్ వార్ అని మాట్లాడుతున్నారని.. క్లాస్ వార్ అంటే ఏమిటి... డబ్బున్న వాడు పేదవారిని దోచుకోవడం, మరి జగన్ పేద వారిని దోచుకున్నారా?.. లేదా? అని ప్రశ్నించారు.

తాము పేదవారికి అండగా నిలిచిమన్నారు. అలాంటి మమ్మల్ని తప్పు పడతారా? అంటూ వైయస్ జగన్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇచ్చిన రూ.335 కోట్లు దారి మళ్లించారని విమర్శించారు. అందులో కేవలం రూ.6.25 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.


పోలీసులకు సంబంధించిన టీఏ, డీఏలు సకాలంలో చెల్లించడం కానీ.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గురించి కానీ సీఎం వైయస్ జగన్ మాట్లాడడం లేదన్నారు. మత్స్యకారుల పొట్ట కొట్టడానికే 217 జీవో తీసుకొచ్చారని ఆరోపించారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి నిధులు దారి మళ్లించి.. వాటిని సైతం దోచుకున్నారని విమర్శించారు.

హైదరాబాద్‌లో శోభయాత్ర: ట్రాఫిక్ ఆంక్షలు

ఈ జగన్ పాలనలో అయిదు సంవత్సరాల్లో 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. అదే టీడీపీ హయాంలో ఒక్క సారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెప్పారు. పోలం పాస్ బుక్ కావాలన్నా,చేపల చెరువులు తవ్వాలన్నా పెడన ఎమ్మెల్యేకి నగదు లంచంగా ఇవ్వాలని ఆరోపించారు. ఈ ఎమ్మెల్యే పెడన పట్టణ డ్రైనేజ్ సమస్య తీర్చలేదు కానీ ఎమ్మెల్యే నోరు మాత్రం డ్రైనేజ్ కంటే దారుణమని ఈ సందస్భంగా వ్యంగ్యంగా అన్నారు. పేకాట క్లబ్బులు నడిపేవారు పదవుల్లోకి వచ్చారన్నారు.

ఎమ్మెల్యే ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్లినా.. ఆయనకు నమస్కారం పెట్టాలని.. ఓ వేళ ఆయనకు నమస్కారం పెట్టకుంటే.. వారిపై గంజాయి కేసు నమోదు చేసిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే అంటూ జోగి రమేష్‌ను గుర్తు చేశారు.


చేనేత సంఘాల వారికి చెల్లించాల్సిన నగదు చెల్లించకపోవడంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. బిజెపి, టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే.. చేనేత, కలంకారి కార్మికుల్లో ఎవరిని కన్నీరు పెట్టించమని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. కలంకారీ వర్క్‌ను ఎవరు కాపీ కొట్టకుండా పటిష్టమైన చట్టాలు తీసుకొస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కళ్లలో పెట్టుకుని కాపాడాలని తన పార్టీ అభ్యర్థులతో ప్రమాణం చేయించాని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పేరును ఉచ్చరించాలని కూడా అనిపించడం లేదన్నారు.

AP Elections: వైసీపీ వెనుకంజకు కారణం అదేనా..?

కలంకారి కార్మికులకు ఐదు ఎకరాల్లో రన్నింగ్ వాటర్ నీ పెడనల ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని..కూటమి ప్రభుత్వ అధికారంలో రాగానే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. మద్యపానం నిషేధిస్తానని చెప్పిన జగన్.. నేడు సారా వ్యాపారిగా తయారై పోయాడని విమర్శించారు. మన ఆరోగ్యాలు చెడగొట్టని మద్యం కావాలని ఈ సందర్బంగా ఆయన ఆకాంక్షించారు.


వైసీపీ ప్రభుత్వం మీ ఆరోగ్యాలు, ఆడపడుచుల పసుపు కుంకుమలు తీసి వేసి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడి ఉందని.. అయితే ఇసుక కోసం తవ్విన గోతుల్లో పడి 76 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఇంటి పక్కన అక్రమ ఇసుక రీచ్ వుందని గుర్తు చేశారు. మా ప్రభుత్వం వస్తుందని వైయస్ జగన్‌కి అర్థం అయిపోయిందన్నారు.

మా మీద వైయస్ జగన్‌కి విపరీతమైన కోపం వస్తుందని... ఆ విషయం తనకు తెలుసునన్నారు. ప్రజా సంపాదన దోచుకున్న మీ అందరికీ శిక్ష తప్పదంటూ వైసీపీ నేతలను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 17 , 2024 | 08:55 PM

Advertising
Advertising